వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్త తల నరికి, టవల్ లో మూటకట్టి ... తాపీగా తీసుకెళ్ళిన అల్లుడు .. కారణం ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఓ అల్లుడు పిల్లనిచ్చిన అత్త తల నరికాడు. అత్యంత దారుణంగా అత్తను హతమార్చాడు. తమ కుమార్తె చనిపోవడానికి అత్త చేతబడి చేసిందని అనుమానించిన అల్లుడు అత్యంత పాశవికంగా ఆమె ప్రాణం తీశాడు. ఇక అంతే కాదు. ఆమె తలను టవల్లో మూటగట్టుకొని 13 కిలోమీటర్ల మేర నడిచి తాపీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్తను తానే చంపానని,తల తీసుకొచ్చానని మూట విప్పి చూపించాడు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్లంతా తాపీగా వచ్చి నరికిన తల చూపిస్తుంటే ఉలిక్కి పడ్డారు.

 మూఢ నమ్మకాలను నమ్మి అత్తపై అల్లుడు దాష్టీకం

మూఢ నమ్మకాలను నమ్మి అత్తపై అల్లుడు దాష్టీకం

చేతబడులు, క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలతో నేటికీ చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని జిల్లాలోని బారిపదా ఏరియా నౌషాహి గ్రామానికి చెందిన బుధురాం సింగ్(30) కుమార్తె మూడు రోజుల కిందట అనారోగ్యంతో మరణించింది. అయితే పాప అనారోగ్యానికి కారణం తన అత్త చంపా సింగ్(60) చేతబడి చేయడం వల్లే అని భావించిన అతని అనుమానానికి తగ్గట్టు, గ్రామంలోనూ పుకారు షికారు చేసింది.

గొడ్డలితో నరికి హతమార్చిన అల్లుడు

గొడ్డలితో నరికి హతమార్చిన అల్లుడు

దీంతో ఆమె మీద కోపం పెంచుకున్న రామ్ ఇంటి వరండాలో నిద్రిస్తున్న అత్తని బయటకు లాగి గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు.అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి కండువాలో చుట్టి, సుమారు 13 కిలోమీటర్లు నడిచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. టవల్‌ లో ఉన్న తల పోలీసులకి తీసి ఇచ్చి తానే హత్య చేశానని అతను చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులకి చెమటలు పట్టాయి.

నాగరిక సమాజంలో మూఢ నమ్మకాలకు ఒక నిండు ప్రాణం బలి

నాగరిక సమాజంలో మూఢ నమ్మకాలకు ఒక నిండు ప్రాణం బలి

షాక్‌ నుండి తేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గ్రామానికి వెళ్లి ఆమె మొండెం స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాలంలోనూ మూఢనమ్మకాలు ఉన్నాయని , చేతబడులు, బాణామతులు ఇంకా కొనసాగుతున్నాయని భావించి అతను చేసిన అఘాయిత్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధించి ముందుకు దూసుకుపోతున్న నేటి నాగరిక సమాజంలోనూ ఇలాంటి ఘటనలు మనల్ని మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. ఇంకా సమాజంలో మూఢనమ్మకాలు పాతుకుపోయి ఉన్నాయని, వాటిని మార్చవలసిన అవసరం ఉందని తేటతెల్లం చేస్తున్నాయి

English summary
Today, many people are behaving foolishly by superstitions like magic and occultism. The latest such incident occurred in Odisha. The daughter of Budhuram Singh, 30, from Naushahi village of Baripada area in Odisha district, died of illness three days ago. However, his aunt Champa Singh (60) was killed by him because he thought it was due to a occultism .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X