వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేడీలకే కేడీ కమల్ బాబు: నకిలీ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు, నోరెళ్లబెట్టిన సిబ్బంది, ముగ్గురి అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల వద్ద కొందరు కేటుగాళ్లు మొహరించి ఉంటామని ఉంటారు. అమాయకులను గుర్తించి ఛీట్ చేస్తుంటారు. కానీ తమిళనాడులో ఓ కేటుగాడు ఏకంగా బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అవును మీరు చదువుతున్నది నిజమే.. మరో ఇద్దరితో కలిసి బ్రాంచ్ తెరిచాడు. ఎలా అంటే నిజమైన బ్రాంచ్ కూడా ఇలా ఉండదేమో.. కానీ ఓ వినియోగదారుడి వల్ల తొందరలోనే నిజం బయటపడింది.

కేడీ కమల్

కేడీ కమల్

కడలూరు జిల్లాకు చెందిన కమల్ బాబు (19) వయసు చిన్నదే కానీ.. మోసం చేయడంలో మాత్రం అరితేరాడు. ఇతని తండ్రి ఎస్బీఐ బ్యాంక్‌లో పనిచేసి 10 ఏళ్ల క్రితం రిటైరయ్యాడు. తల్లి కూడా రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉండే కమల్ బాబు.. ఈజీ మనీ సంపాదించాలని అనుకొన్నాడు. దొంగతో మరో ఇద్దరు చేతులు కలిపారు. మనిక్యాం (52) అనే రబ్బర్ స్టాంప్ తయారుచేసే వ్యక్తి, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కుమార్ (42) చేతులు కలిపారు. ఇంకేముంది వీరు అనుకొన్నారో లేదో.. పన్రూటిలో ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వెలసింది.

నకిలీ బ్యాంక్

నకిలీ బ్యాంక్

అచ్చం ఎస్బీఐ బ్యాంకు లాగానే నకిలీ బ్యాంక్ ఉంది. బ్యాంకు మొదలెట్టి 3 నెలలవుతోంది. ఖాతాదారులు వచ్చి మెల్లగా అకౌంట్స్ ఓపెన్ చేసే పరిస్థితి. ఇంతలో ఒకరు పన్నూటిలో గల కొత్త బ్రాంచ్ గురించి ఆరా తీశారు. పన్రూటీలో మరో బ్రాంచ్ పెట్టారా అని అడిగితే.. జోనల్ కార్యాలయం అలాంటిదేమీ లేదు.. రెండు బ్రాంచిలే ఉన్నాయని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి.. బ్రాంచ్ చూసి ఖంగుతిన్నారు. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

Salony Luthra Interview Part 03 తెలుగు వాళ్ళు నాకు బాగా నచ్చేసారు!! | Bhanumathi Ramakrishna
నో ట్రాన్సాక్షన్

నో ట్రాన్సాక్షన్


అయితే నకిలీ బ్యాంకులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ప్రజలు రావడం ప్రారంభించి.. ఖాతా తెరిస్తే ట్రాన్సక్షన్ జరిగి ఉండేది. కానీ లావాదేవీలు జరగకపోవడంతో.. పై అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు కమల్ బాబు సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కానీ నకిలీ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం కలకలం రేపింది. అందులో లావాదేవీలు జరిగితే పరిస్థితి ఏమిటని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

English summary
fraud bank running as an SBI branch in Panruti has been busted in Cuddalore district of Tamil Nadu while three people were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X