• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొడుకు రేప్ చేస్తే వీడియో తీసిన తల్లి .. ఆపై ఏం చేసిందంటే

|

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లి అన్న పదానికి అర్థం మరిచిన ఓ మహిళ ఓ యువతిపై కొడుకు అఘాయిత్యానికి పాల్పడుతుంటే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. సదరు యువతి వద్దనుండి లక్షల రూపాయలు కాజేసింది.. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది.

తల్లితో కలిసి యువతిని ట్రాప్ చేసిన యువకుడు

తల్లితో కలిసి యువతిని ట్రాప్ చేసిన యువకుడు

అసలేం జరిగిందంటే చత్తీస్ ఘడ్ లోని బలోడా బజార్ జిల్లాలో ఓ యువకుడు సంపన్న వర్గానికి చెందిన ఒక యువతి ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు . ఆమె వద్ద నుండి ఎలాగైనా డబ్బు గుంజాలని నిర్ణయించుకున్న అతను పక్కా ప్లాన్ వేశాడు . సంపన్న వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె నుంచి డబ్బులు లాగేందుకు తల్లితో కలిసి ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా ఆ యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు .

మత్తిచ్చి రేప్ చేసిన కొడుకు .. వీడియో తీసిన తల్లి

మత్తిచ్చి రేప్ చేసిన కొడుకు .. వీడియో తీసిన తల్లి

ఇక ఆమెను తల్లి బాగా పలకరించి మాటలతో ఆకట్టుకుని మత్తు మందు కలిపినా ఆహరం పెట్టారు. బాగా నమ్మించి తినిపించిన ఆహారంలో మత్తు మందు కలిపి తమ ప్లాన్ అమలు చేశారు సదరు తల్లీ కొడుకులు. ఇక ఆ తర్వాత ఆమెను బెడ్ రూం లోకి తీసుకెళ్లి కొడుకు అత్యాచారానికి పాల్పడుతూ ఉంటే తల్లి ఆ ఘటనను వీడియో తీసింది. కాసేపటి తర్వాత మత్తు నుండి తేరుకున్న యువతి తనపై అత్యాచారం జరిగిందని గుర్తించి సదరు యువకుడిని నిలదీసింది.

రేప్ వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేసిన తల్లి .. 4 లక్షలు వసూలు

రేప్ వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేసిన తల్లి .. 4 లక్షలు వసూలు

దీంతో యువకుడి తల్లి జోక్యం చేసుకుని ఈ మొత్తం ఘటనను వీడియో తీశానని, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే దానిని బయటపెడతానని బెదిరించింది. దీంతో భయపడిన యువతి.. పొలం అమ్మగా వచ్చిన డబ్బులను జాగ్రత్త చెయ్యమని తండ్రి ఆరు లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులలో నాలుగు లక్షల రూపాయలను తండ్రికి తెలియకుండా వారికి ఇచ్చింది. ఇక ఈ రేప్ విషయం , వీడియో వ్యవహారం యువకుడి అక్కా, బావలకు తెలియడంతో వారు కూడా యువతిని డబ్బు కోసం బెదిరించారు.

తండ్రికి చెప్పిన యువతి .. కేసు నమోదు , తల్లీ కొడుకుల అరెస్ట్

తండ్రికి చెప్పిన యువతి .. కేసు నమోదు , తల్లీ కొడుకుల అరెస్ట్

ఇదే సమయంలోతాను దాచిపెట్టమని ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటూ తండ్రి సదరు యువతిని అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్టు తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన తల్లి, కుమారుడితో పాటు అక్క బావలను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు వారు కటకటాలు లెక్కిస్తున్నారు. పెడదారి పడుతున్న కొడుకుని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన తల్లి, కొడుకుతో కలిసి చేసిన నిర్వాకం తల్లి అన్న పదానికి మాయని మచ్చ తెచ్చింది .

English summary
Chhattisgarh has witnessed the worst incident in the state. A mother has taken a video of a young woman being abused by her son and black mailed the woman for money by showing the video. The incident in Chhattisgarh has shocked the society .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X