వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలన్నర రోజులుగా ఆ విషయం మీకు తెలుసు.. సరిహద్దులో అసలేం జరిగిందో చెప్పండి...

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో చైనాతో చెలరేగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి సూటి ప్రశ్నలు వేశారు.అసలు చైనా భారత భూభాగాన్ని ఎప్పుడు ఆక్రమించుకుందో.. 20 మంది జవాన్లను ఎలా కోల్పోయామో ప్రధాని దేశ ప్రజలకు చెప్పాలన్నారు. అలాగే ఇంకా ఎంతమంది సైనికులు గాయపడ్డారు.. ఎంతమంది మిస్సయ్యారు.. అన్నది బయటపెట్టాలన్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని చెప్పారు.

నెలన్నర రోజులుగా ఆ విషయం మీకు తెలుసు..

నెలన్నర రోజులుగా ఆ విషయం మీకు తెలుసు..


' గత నెలన్నర రోజులుగా చైనా ఆర్మీ భారత భూభాగాన్ని ఆక్రమిస్తోందన్న విషయం మీకు తెలుసు. 20 మంది సైనికులు అమరులవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రధాని మోదీ.. చైనా భారత భూభాగాన్ని ఎలా ఆక్రమించుకుందో ఇప్పటికైనా చెప్పాలి. అసలు ఏయే భూభాగాలను చైనా ఆక్రమించుకుందో కూడా చెప్పాలి. దీనిపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో దేశ ప్రజలకు వివరించాలి.' అని సోనియా మోదీని కోరారు.'అమరులైన 20 మంది జవాన్ల త్యాగానికి యావత్ దేశం చలించింది. ఆ ధైర్య సైనికులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.' అని సోనియా పేర్కొన్నారు.

మోదీకి రాహుల్ ప్రశ్నలు...

మోదీకి రాహుల్ ప్రశ్నలు...


అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్‌లో ఈ అంశంపై స్పందించారు. ప్రధాని మోదీ ఇంకా దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు.. ఎందుకు దాక్కుంటున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకూ జరిగింది ఇక చాలని... అసలేం జరిగిందో బయటపెట్టాలని రాహుల్ మోదీని డిమాండ్ చేశారు. మన జవాన్లను చంపేందుకు.. మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనాకు ఎంత ధైర్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Gandhi Hospital Doctor face to face with Oneindia telugu
త్యాగం వృథా కాదన్న మోదీ...

త్యాగం వృథా కాదన్న మోదీ...

ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మోదీ భారత్-చైనా ఉద్రిక్తతలపై స్పందించారు. అంతకుముందు వారి మరణానికి సంతాపంగా కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని.. అయితే కయ్యానికి కాలు దువ్వితే మాత్రం అంతే ధీటుగా బదులివ్వగలమని స్పష్టం చేశారు. మన జవాన్ల త్యాగాలు వృథాగా పోవని అన్నారు. ఇండియా-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 19 సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. అన్ని కీలక పార్టీల అధినేతలు,అధ్యక్షులు సమావేశానికి హాజరుకానున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.

English summary
Congress interim chief Sonia Gandhi on Wednesday attacked Prime Minister Narendra Modi for his alleged silence on the violent face-off between India and Pakistan in eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X