వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీయేతర పక్షాలకు సోనియా ఆహ్వానం అబద్ధం, 23 తర్వాతే నిర్ణయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే 23న యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. అయితే యూపీయేతర పక్షాలకు మాత్రం చైర్ పర్సన్ సోనియా సమాచారం అందించలేదు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసాక పరిస్థితిని బట్టి ఇతర పక్షాలతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.

sonia does not call non upa parties

యూపీఏ పక్షాల భేటీ ..
కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ యూపీఏ పక్షాల సమావేశం ఆ రోజే నిర్వహిస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యూపీయేతర పక్షాలతో కూడా సమావేశం ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. వైసీపీ, టీఆర్ఎస్ .. ఇతర పార్టీలకు సమాచారం అందిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టిపారేశాయి. తాము ఎవరూ సమాచారం అందించలేదని .. సోనియాగాంధీ లేఖ కూడా రాయలేదని పేర్కొన్నారు. ఇది అబద్ధమని స్పష్టంచేశారు. ఫలితాల రోజు యూపీఏ పక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఇతర పక్షాలతో సమావేశం .. మద్దతు తదితర అంశాలపై డిస్కస్ చేసే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.

లీకులు అందుకే ...
ఎన్డీఏకు మెజార్టీ రాదనే ఊహాగానాలతో .. తటస్థంగా ఉండే పార్టీల మద్దతు కూడగట్టాలని యూపీఏ భావిస్తున్నట్టు చర్యలను బట్టి తెలుస్తోంది. అందుకోసమే తొలుత ఇతర పక్షాలు కూడా భేటీలో పాల్గొంటారని లీకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. అంతలోనే మాట మార్చడంలో ఆంతర్యం మాత్రం .. యూపీఏ కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తాయనే ధీమా కల్పించడమేనని తెలుస్తోంది. ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే తొలుత అనుకున్నట్టు ఇతర పక్షాలతో సంప్రదింపులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary
A meeting of the UPA Parties on 23rd of the counting of votes for the general election will be held. Chairperson Sonia Gandhi did not provide information on non-UP parties. The counting of votes for the polls is likely to be convened by other parties depending on the situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X