వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్వరంతోనే రోడ్ షో: కారుపైకి ఎక్కిన సోనియా, విమానం పంపిన మోడీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారీస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కార్యకర్తల నినాదాలు.. పార్టీ శ్రేణుల కోలాహలం.. ప్రజల అభివాదాలు.. సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా సోనియా గాంధీ నిలిచారు. కారు డోరు తీసుకుని నిలబడి ప్రజలను చూసి చేతులు ఊపుతూ హుషారుగా దాదాపుగా 8 కిలోమీటర్ల రోడ్‌ షో నిర్వహించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో రోడ్‌షోతో సోనియా ప్రచార సంరంభం ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా ఆమెకు తీవ్రంగా జ్వరం రావటంతో ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఆమె వెళ్లిపోయారు. వారణాసి సర్క్యూట్ హౌస్ దగ్గర బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయటంతో ప్రారంభమైన సోనియా రోడ్‌షో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర సాగింది.

మొదట కార్లో ప్రయాణించిన సోనియా.. ఆ తరువాత ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించారు. ఆమె రోడ్‌షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. '27 సంవత్సరాల్లో అన్యాయమైన యూపి' నినాదంతో ఆమె రోడ్‌షో నిర్వహించారు.

సోనియా వెంట యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, ప్రమోద్ తివారీ, సంజయ్‌సింగ్, రాజ్‌బబ్బర్‌లు పాల్గొన్నారు. వందలాది కార్యకర్తలు మోటార్ బైక్‌లపై ఆమెను అనుసరించారు. మోడీ వారణాసి నుంచి ఎన్నికై ప్రధాని అయిన తర్వాత సోనియా ఇక్కడికి రావటం ఇదే మొదటి సారి. సాయంత్రం కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రార్థనలు చేయాల్సి ఉన్నా జ్వరం రావటంతో సోనియా వెళ్లిపోయారు.

ప్రత్యేక విమానం పంపిన మోడీ

కాగా, సోనియా అనారోగ్యం విషయం తెలియగానే ప్రధాని మోడీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు ఫోన్‌ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. సోనియా గాంధీకి చికిత్స చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని, వైద్యుడిని పంపారు.

వారణాసి ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే ఆమెకు అత్యవసర చికిత్స చేయించారు. అక్కడి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బీబీ సింగ్‌ వెంటరాగా.. సోనియాను విమానంలో ఢిల్లీకి తరలించారు. అక్కడ సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంక ఆమెను రిసీవ్‌ చేసుకున్నారు. ఢిల్లీకి చేరగానే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు.

సోనియా రోడ్ షో

సోనియా రోడ్ షో

నిజానికి సోనియాగాంధీ ఈ రోడ్‌షో ప్రారంభమయ్యే సమయానికే వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని సమాచారం. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినరోజే షోను రద్దు చేసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో ఆమె ర్యాలీలో పాల్గొన్నారు.

సోనియా రోడ్ షో

సోనియా రోడ్ షో

వీలైనంతవరకూ ఉత్సాహంగా కనిపించారు. మూడు గంటలపాటు సాగిన 8 కిలోమీటర్ల రోడ్‌ షో ముగింపు దశకు వచ్చేసరికి డీహైడ్రేషన్‌కు గురై నీరసపడిపోయారు.

సోనియా రోడ్ షో

సోనియా రోడ్ షో

ఇక రోడ్‌షోను కొనసాగించలేక వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రం కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాల్సి ఉందని.. కానీ, అనారోగ్యం కారణంగా పర్యటనను కుదించుకోవాల్సి వచ్చిందని, మరోసారి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటానని సోనియా పేరిట ఒక ప్రకటన విడుదలైంది.

సోనియ రోడ్ షో

సోనియ రోడ్ షో

కాగా, సోనియా అనారోగ్యం విషయం తెలియగానే ప్రధాని మోడీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు ఫోన్‌ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు.

English summary
Varanasi, Aug 2: Congress President Sonia Gandhi on Tuesday suddenly took ill during a road show in the parliamentary constituency of Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X