వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్నుంచి నరుక్కొస్తోన్న సోనియా: వైఎస్ జగన్, కేసీఆర్ సహా: మమతా బెనర్జీతో కలిసి ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వచ్చేెనెల దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను పూర్తి చేసింది. ఈ రెండు పరీక్షలు వాయిదా పడొచ్చనే వార్తలకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తెర దించింది. అడ్మిట్ కార్డులను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నీట్ పరీక్షల అడ్మిట్ కార్డులు దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో నేడో, రేపో అప్‌లోడ్ చేయబోతోంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన కోవిడ్ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

సోనియా, రాహుల్ సారథ్యంపై రేవంత్, భట్టి సంచలనం: గాంధీ కుటుంబం త్యాగం: వేర్వేరు లేఖలతో సోనియా, రాహుల్ సారథ్యంపై రేవంత్, భట్టి సంచలనం: గాంధీ కుటుంబం త్యాగం: వేర్వేరు లేఖలతో

సోనియా, మమతా బెనర్జీ జాయింట్‌గా

సోనియా, మమతా బెనర్జీ జాయింట్‌గా


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయించడానికి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. పరీక్షలను వాయిదా వేయించడానికి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి ముఖ్యమంత్రుల వైపు నుంచి నరుక్కుని వచ్చే ప్రయత్నాలను చేపట్టింది. దీనికోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా బరిలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి తనవంతు ప్రయత్నాలను ఆరంభించనున్నారు.

మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్..

మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్..

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రిగా రెండోసారి ఎంపికైన తరువాత సోనియాగాంధీ చేపట్టిన మొట్టమొదటి టాస్క్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయించడానికి భారతీయ జనాతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ, మమతా బెనర్జీ సంయుక్తంగా ఈ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేశారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు..

కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు..

మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలోో పాల్గొనబోతున్నారు. జార్ఖండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్, ఉద్ధవ్ థాకరేలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ , బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ, ఒడిశా, కేరళల ముఖ్యమంత్రులకు కూడా సమాచారం పంపించారని సమాచారం. దీనిపై వారి వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదని చెబుతున్నారు. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఇదివరకే కేరళ, ఒడిశా ముఖ్యమంత్రులు పినరయి విజయన్, నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Recommended Video

Reopening of Schools and Colleges ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనే లేదు !
పరీక్షల వైపే మొగ్గు?

పరీక్షల వైపే మొగ్గు?


కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించడం సరికాదంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించడం వైపే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సోనియాగాంధీతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్, కేసీఆర్ పాల్గొనకపోవచ్చనీ అంటున్నారు.

English summary
Bengal chief minister Mamata Banerjee and Congress interim president Sonia Gandhi have jointly convened a meeting of chief ministers of non-BJP ruled states on Wednesday afternoon to demand postponement of the National Eligibility cum Entrance Test (NEET) and Joint Entrance Examination (JEE) to be held in September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X