వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరామర్శ: తీహార్‌ జైలులో చిదంబరంను కలిసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు పరామర్శించారు. చిదంబరంకు పార్టీ అండగా ఉందని చెప్పేందుకు ఈ పరామర్శతో సంకేతాలు పంపారు. ఐఎన్‌క్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5 నుంచి చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు. గత మూడు వారాలనుంచి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టులు చిదంబరంకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించాయి.

ఇక చిదంబరం తన అధికారిక ట్విటర్ నుంచి ఆదివారం ట్వీట్ చేశారు. తన పేరుమీదుగా ఈ ట్వీట్ చేయమని తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు చిదంబరం తెలిపారు. తనకు బంగారు రెక్కలు వచ్చి చందమామ మీదకు ఎగిరిపోతారని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని అయితే తాను సేఫ్‌గా ల్యాండ్ అవుతానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఎఫ్ఐపీబీ క్లియరెన్స్‌ ఇవ్వడంలో చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. 2007లో జరిగిన ఈ అవకతవకల విలువ రూ.305 కోట్లుగా ఉందని సీబీఐ తేల్చింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. 2017, మే 15న సీబీఐ చిదంబరంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇక ఆగష్టు 21న చిదంబరంను కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. ఆ తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన చిదంబరంను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. 14 రోజుల తర్వాత సీబీఐ కోర్టు అక్టోబర్ 3వరకు కస్టడీని పొడిగించింది.

Sonia Gandhi and Manmohan visit Chaidambaram at Tihar Jai,extend support

ఇదిలా ఉంటే తనకు వెన్నునొప్పి ఉందంటూ చిదంబరం కోర్టు దృష్టికి తెచ్చారు. తనకు జైలులో ఒక కుర్చీ, ఒక తలదిండును కూడా అధికారులు ఇవ్వలేదని తెలిపారు. వెన్నునొప్పి కారణంగా చిదంబరంకు కుర్చీ, తలగడ ఇవ్వాలని సీబీఐ కోర్టు జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇచ్చింది. చిదంబరం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలు ఉన్నారు.

English summary
Congress President Sonia Gandhi and Former Prime Minister Manmohan Singh visited Former union Minister Chidambaram who is locked in Tihar Jail to extend the party support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X