వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుదుటపడ్డ సోనియా గాంధీ ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ(73) ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని, బుధవారం ఆమెను ఇంటికి పంపినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతూ సోనియా ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు.

''కడుపులో ఇన్ ఫెక్షన్ నయం కావడంతో సోనియా క్రమంగా కొలుకున్నారు. బుధవారమే ఆమెను డిశ్చార్జ్ చేశామని సర్ గంగా రామ్ ఆస్పత్రి చైర్మన్ (బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్) డాక్టర్ డీఎస్ రానా పేరుతో బుధవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదలైంది.

Sonia Gandhi discharged from Ganga Ram Hospital

ఆరోగ్యం సహకరించకపోవడంతో సోనియా గాంధీ శనివారం నాటి కేంద్ర బడ్జెట్ ప్రసంగానికి రాలేకపోయారు. తర్వాతిరోజైన ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరారు. సోనియా గాంధీ వయసు 73 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె సర్వైకల్ కేన్సర్‌కు ట్రీట్ మెంట్ తీసుకున్న సంగతి తెలిందే.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని బుధ‌వారం ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన తర్వాత, ఆమె నివాస స్థలమైన 10 జన్ పథ్ వద్ద సందడి నెలకొంది. తమ అధినేత సేఫ్ గా ఇంటికొచ్చారన్న వార్త తెలియడంతో 10 జన్ పథ్ లోని ఆమె ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల హడావుడి కనిపించింది. సోనియాను ఆస్పత్రిలో చేర్చినప్పుడు, మళ్లీ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు రాహుల్, ప్రియాంక గాంధీలు వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary
Congress president Sonia Gandhi, who was undergoing treatment for a stomach infection at the Sir Ganga Ram Hospital in New Delhi, was discharged on Wednesday, hospital authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X