వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం పై మండిపడ్డ సోనియా గాంధీ..! సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ద్వజం..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : సమాచార హక్కు చట్టంపై అగ్గి రగులుతోంది. కేంద్ర తీసుకొచ్చిన మార్పులపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆరోపించారు. చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని విమర్శించారు. పదేళ్లలో 60లక్షల మంది సమాచార హక్కు(స.హ) చట్టాన్ని వినియోగించుకున్నారని గుర్తుచేశారు.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల చట్టం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం-2005ని సుదీర్ఘ చర్చలు, విస్తృత సంప్రదింపులతో రూపొందించామని వివరించారు. దీని ద్వారా ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఒక పీడగా భావిస్తోందని సోనియా ఆరోపించారు.

Sonia Gandhi fired on the Center.!Right to Information Act becomimg in-active..!!

కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌తో సమాన హోదా కల్పించిన సమాచార హక్కు కమిషనర్‌ విధుల్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సంఖ్యాబలం ఉండడంతో భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలాగైనా సాధించాలని చూస్తోందన్నారు. ఈ క్రమంలో పౌరుల హక్కుల్ని హరిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. సమాచార కమిషనర్లకు ప్రస్తుతం ఎన్నికల సంఘం కమిషనర్లతో సమానమైన హోదా ఉండగా దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది.

వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడిగా రూపొందించనుంది. ఈ సవరణలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సమాచార కమిషన్‌ను కోరల్లేని పులిలా మార్చడానికే సవరణల బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించాయి. విపక్షాల విమర్శల మధ్య సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణలను సోమవారం లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.

English summary
Right to Information Act Opposition parties are worried about the changes brought by the Center. Congress leader and UPA chairperson Sonia Gandhi alleged that the Modi government was looking to weaken the RTI Act. Criticized that the center is moving with the aim of damaging the law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X