• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మే 23న సోనియా ఎన్డీయేతర పక్షాల భేటీకి ఆహ్వానం ..ఫలితాల రోజు భేటీ సక్సెస్ అయ్యేనా ?

|

కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న యూపీఏ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీని కోసం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగింది. ఎన్డీయే ను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలను మరింత బలోపేతం చేసే దిశగా యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అడుగు ముందుకేశారు.ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్దీఎకు చెక్ పెట్టేందుకు సిద్ధం అయిన సోనియాగాంధీ యుపిఎ భాగస్వామ్య పక్షాలకు, ఎన్డీఎయేతర పార్టీలకు లేఖలు రాశారు. మే 23 న నిర్వహించే సమావేశానికి రావాలని కోరారు.

జగన్ మకాం అమరావతికి మార్చటానికి రీజన్ ఇదే .. గెలుపు ధీమాతో జోష్ లో ఉన్న జగన్

బాబునే కాదు జగన్ ను , కేసీఆర్ ను తటస్తులను అందరినీ ఆహ్వానించిన సోనియా గాంధీ

బాబునే కాదు జగన్ ను , కేసీఆర్ ను తటస్తులను అందరినీ ఆహ్వానించిన సోనియా గాంధీ

ప్రజా తీర్పు ఎన్డీఏకు అనుకూలంగా లేకపోతే యూపీఏ భవిష్యత్తు కార్యాచరణకు తమ సమావేశం రోడ్ మ్యాప్ వేసే దిశగా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆమె ఎన్డీయే పక్షాలను కాకుండా మిగతా ప్రాంతీయ రాజకీయ పార్టీలను, తమకు మద్దతు ఇస్తున్న పార్టీలనే కాకుండా, తటస్థంగా ఉన్న పార్టీలను సైతం సమావేశానికి రావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుకు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ , మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తో స్వయంగా మాట్లాడి 23వ తేదీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. 23వ తేదీ సమావేశానికి పలు రాజకీయ పార్టీలు హాజరు కావడమనేది ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.

ఎవరికి వారు వ్యూహాలతో ముందుకు వెళ్తున్న ఎన్డీయే , యూపీఏ పక్షాలు

ఎవరికి వారు వ్యూహాలతో ముందుకు వెళ్తున్న ఎన్డీయే , యూపీఏ పక్షాలు

ఇక ఎన్డీయే సైతం తటస్తులకు గాలం వేస్తుంది. తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అమిత్ షా ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది అంచనా వేసి మరీ ఆ పార్టీని తమతో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా మరోమారు అధికారం కాపాడుకోవాలని భావిస్తున్న అమిత్ షా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అటు సోనియా గాంధీ సైతం ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు .

 మే 23 న సోనియా గాంధీ సమావేశానికి రాజకీయ పార్టీల హాజరు సాధ్యమేనా

మే 23 న సోనియా గాంధీ సమావేశానికి రాజకీయ పార్టీల హాజరు సాధ్యమేనా

ఒక పక్క దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. మే 23 న రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది . ఈ నేపధ్యంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి మే 23వ తేదీన నిర్వహిస్తున్న సమావేశానికి సోనియా ఆ పార్టీల నేతలను ఆహ్వానిస్తూ లేఖలు రాశారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉన్న రోజునే సోనియా ఏర్పాటు చేసే సమావేశానికి రాజకీయ పార్టీలు ఆసక్తి చూపిస్తాయా అన్నది ప్రశ్నే. ఎందుకంటే ఏ పార్టీ కి ఆ పార్టీ ఎన్నికల ఫలితాలు, విశ్లేషణలు, పోస్ట్ మార్టం చెయ్యటాలు, భవిష్యత్ పార్టీ కార్యాచరణ వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టే రోజున , అన్ని పార్టీలకు అత్యంత కీలకమైన రోజున సమావేశం నిర్వహిస్తే హాజరయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని రాజకీయ వర్గాల భావన . ప్రజా తీర్పు తర్వాత యుపిఎ భాగస్వామ్య పక్షాలు, ఎన్డీయేయేతర పక్షాలు ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు . కానీ ఆమె నిర్ణయించిన తేదీనే సరైనది కాదనేది చాలా మంది భావన .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a move clearly aimed at strengthening opposition unity and to checkmate the Narendra Modi-led NDA, UPA chairperson Sonia Gandhi has written to all UPA allies and non-NDA parties — namely the BJD, the YSR Congress, the TRS and the TD — inviting them for a meeting on May 23 to discuss the future course of action.The meeting, which has been called on the day when the Lok Sabha election results are to be announced, holds significance as sources point out that the message sent out by Ms Gandhi is that all UPA and non-NDA parties need to rally together after the verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more