వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రమ్య క్యూట్ థ్యాంక్స్: సోనియా సభలో లడ్డూ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇటీవల ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థి, నటి రమ్యను గెలిపించినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం కర్నాటకలోని మాండ్య నియోజకవర్గంలో ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. మాండ్యలో ఏర్పాటు బహిరంగ సభలో సోనియా మాట్లాడారు. దేశ సమగ్రాభివృద్ధే యుపిఎ ప్రధాన విధానంగా ఉంటుందని, ఈ విధానానికి అనుగుణంగానే ప్రజల కోసం ప్రత్యేకించి బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను, చట్టాలను అమలులోకి తీసుకువచ్చిందన్నారు.

భారతీయ జనతా పార్టీకి తాము ఏమాత్రం భయపడటం లేదన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అవహేళన చేస్తారా అని ప్రశ్నించారు. తాము బిజెపితో సహా ఏ ప్రతిపక్షానికి భయపడటం లేదన్నారు. తమ పార్టీ మొత్తం మన్మోహన్ సింగ్ వెనుకనే ఉందని ఆమె చెప్పారు.

గత పదేళ్లలో యూపిఏ ప్రభుత్వం సమాచారం హక్కు, విద్యా హక్కు, భూసేకరణ నియంత్రణ చట్టాలని తెచ్చిందన్నారు. కేంద్రంలో ఆరేళ్లు, రాష్ట్రంలో ఏడేళ్లు అధికారంలో ఉన్న బిజెపి ఆ చట్టాలన్ని ఎందుకు చేయలేకపోయిందన్నారు. తాము ఏనాడు రైతులను నిర్లక్ష్యం చేయలేదన్నారు.

ఎంపి, నటి రమ్య ప్రసంగం

ఎంపి, నటి రమ్య ప్రసంగం

మాండ్య బహిరంగ సభలో స్థానిక ఎంపి, నటి రమ్య ప్రసంగించారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని చెప్పారు.

రమ్య ట్వీట్

బహిరంగ సభ అనంతరం మాండ్య పార్లమెంటు సభ్యురాలు రమ్య ట్విట్టర్‌లో స్పందించారు. సోనియా తనకు కృతజ్ఞతలు చెప్పడం ఓ మంచి అనుభూతి అన్నారు.

కర్నాటక పిసిసి అధ్యక్షుడు

కర్నాటక పిసిసి అధ్యక్షుడు

మాండ్యలో జరిగిన బహిరంగ సభలో కర్నాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కమిటీ అధ్యక్షుడు మాట్లాడారు. కాంగ్రెసును గెలిపించిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సభలో లడ్డూలు అంటూ బిజెపి ట్వీట్

సభలో లడ్డూలు అంటూ బిజెపి ట్వీట్

సోనియా మాండ్య సభలో పాల్గొన్న వారికి లడ్డూలు ఇస్తున్న ఓ చిత్రాన్ని భారతీయ జనతా పార్టీ నెట్లో ఉంచి ట్వీట్ చేసింది. ప్రజలు భిక్షగాళ్లనుకుంటున్నారా అని ప్రశ్నించింది. కాంగ్రెసు తమ విజయాన్ని లడ్డూలు ప్రజల వైపు విసరడం ద్వారా జరుపుకుంటోందని ఎద్దేవా చేశారు.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

మాండ్య నియోజకవర్గంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా సభ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.

సభ వద్ద

సభ వద్ద

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిరంగ సభకు ముందు స్థానిక పార్లమెంటు సభ్యురాలు రమ్య, సీనియర్ నాయకులు అంబరీష్ తదితరులు.

సోనియాకు స్వాగతం

సోనియాకు స్వాగతం

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘన స్వాగతం పలుకుతున్న కర్నాటక కాంగ్రెసు పార్టీ నాయకులు. ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు.

సోనియా ప్రసంగంలో భాగం

సోనియా ప్రసంగంలో భాగం

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాండ్య నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి రమ్యను ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నల్ల జెండా

నల్ల జెండా

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాండ్య నియోజకవర్గం సభలో మాట్లాడుతుండగా నల్ల జెండా చూపిస్తూ నిరసన తెలుపుతున్న ఓ నిరసనకారుడు.

English summary
Congress President Sonia Gandhi on Monday, Sept 30 reached Mandya, Karnataka to thank voters. This was her first visit to that state after Congress' victory against BJP in assembly election which was held in 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X