వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ జై, బయటనుంచి మద్దతు, రాజ్‌భవన్ వెళ్లిన ఆదిత్య

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. వీరికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇస్తోంది. ఆదిత్య థాకరే మహారాష్ట్ర సీఎం పదవీ చేపట్టబోతున్నారు. కాసేపటి క్రితం ఆయన రాజ్‌భవన్ వెళ్లారు. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది వివరిస్తారు.

మరో 24 గంటలు

మరో 24 గంటలు

అయితే శివసేన పార్టీ తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు మరో 24 గంటల సమయం కోరింది. శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇస్తోంది. అయితే పదవుల పందేరంపై మాత్రం పీటముడి నెలకొంది. ఊహించినట్టు ఆదిత్య థాకరే సీఎం అవుతారా లేదంటే ఉద్దవ్ థాకరే పేరు తెరపైకి వస్తోందా అనే సందేహాలు తలెత్తున్నాయి.

సమయం ముగుస్తోన్న వేళ..

సమయం ముగుస్తోన్న వేళ..

ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ సమయం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ శివసేనతో దోస్తి కట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఇస్తామని చెబుతోంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు సోనియాగాంధీ మహారాష్ట్ర ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకున్నారు. వారి అభీష్టం మేరకు ప్రభుత్వంలో కలువకుండా బయట నుంచి మద్దతిస్తామని తెలిపారు. అయితే పదవుల పందేరంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరూ సీఎం పదవీ చేపడుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

బెర్తులపై రానీ క్లారిటీ

బెర్తులపై రానీ క్లారిటీ

శివసేనకు సీఎం పదవీ, ఎన్సీపీ డిప్యూటీ సీఎం పోస్టులు దక్కే అవకాశం ఉంది. క్యాబినెట్ బెర్తులు కూడా సమానంగా తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వాగతిస్తున్నారు.

స్పీకర్ పోస్టు కోసం పట్టు

స్పీకర్ పోస్టు కోసం పట్టు


మహారాష్ట్రలో శివసేనకు బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై శివసేన ఎలాంటి సమాధానం ఇవ్వలేదని విశ్వసనీయంగా తెలిసింది. మహారాష్ట్రలో సమస్యలు, ఇరిగేషన్, రైతులు, ఉద్యోగం, మౌలిక వసతుల సదుపాయన కల్పనకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. కామన్ మినిమం ప్రోగ్రామ్‌ మేరకు తాము బయటనుంచి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

English summary
Maharashtra Government Formation, adithya will be cm. congress support to government outside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X