వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

130 సంవత్సరాల కాంగ్రెస్‌కు గాంధీ కుటుంభమే శరణ్యమా...? అధ్యక్షురాలిగా సోనియా గాంధీ..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి సోనియా గాంధీ పగ్గాలు చేపడతారా... ఇందుకు సంబంధించి తాజాగా సోనియా గాంధీ పేరు పార్టీ వర్గాల్లో రావడంతో చర్చనీయంశంగా మారింది. గత నెల రోజులుగా పార్టీ పదవిపై స్పష్టత రాకపోవడంతో మరోసారీ పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు సోనియా గాంధీని కోరినట్టు సమాచారం. దీంతో పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

 రాహుల్ గాంధీ రాజీనామ క్రైసిస్

రాహుల్ గాంధీ రాజీనామ క్రైసిస్


ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ రాజీనామ చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే...అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని గట్టేక్కించే నాయకుడు లేకపోవడం కూడ ఆపార్టీ ఇబ్బందులను ఎదుర్కోంటుంది. దీంతో రాహుల్ గాంధిని బుజ్జగించేందుకు చాల మంది సీనియర్ నేతలతోపాటు చివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సీఎంలు సైతం కలిసి రాహుల్ గాంధి కొనసాగాలని కోరారు.

రోడ్లపై డబ్బే డబ్బు....! కార్లు దిగి తీసుకువెళ్లిన జనం...! వీడియో రోడ్లపై డబ్బే డబ్బు....! కార్లు దిగి తీసుకువెళ్లిన జనం...! వీడియో

అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్ల పేర్లు

అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్ల పేర్లు

అయితే రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక నాయకుల ఒత్తిడి తనపై ఎక్కువవుతుండడంతో చివరకు అధికారిక రాజీనామ చేస్తూ... నాలుగు పేజీల లేఖను సైతం రాశాడు. దీంతోపాటు పార్టీని ప్రక్షాళన చేయడం కోసం ఆయా రాష్ట్రాల నేతలు రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పార్టీ ఇంచార్జులు సైతం పార్టీకి రాజీనామాలు చేశారు. ఇక అప్పటి నుండి పార్టీ అధ్యక్షపదవి కోసం పార్టీ సీనియర్లు పేర్లు వినిపించాయి. ఓవైపు మల్లికార్జున్ ఖార్గే తోపాటు సుశిల్ కుమార్ షిండే, మోతిలాల్ వోరా లాంటీ సీనియార్ నాయకుల పేర్లు వినిపించాయి.

చివరికి సోనియా గాంధి వద్దకు పార్టీ శ్రేణులు

చివరికి సోనియా గాంధి వద్దకు పార్టీ శ్రేణులు

ఇక చివరగా పార్టీ నాయకులు సోనియాగాంధిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు కొరినట్టు సమాచారం. అయితే సోనియా గాంధీ మాత్రం సరిగా స్పందించలేదని పార్టీ నేతలు తెలిపారు.మరోవైపు తాను అధ్యక్షపదవిని తిరిగి చేపడుతున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను సైతం సోనియా గాంధీ కొట్టిపారేశారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు లేకపోలేదని అని చెబుతున్నారు.

19 ఏళ్ల పాటు పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ

19 ఏళ్ల పాటు పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ


1998లో సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 19ఏళ్ల పాటు అధినేత్రిగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆమె.. 2017 డిసెంబరులో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు.

English summary
The Congress, unravelling in several states after its national election debacle, has urged Sonia Gandhi to take charge as interim president to tide over the party's bleakest hour. So far, the former Congress president had said no to the role that her son Rahul Gandhi has just relinquished, owning responsibility for the party's abysmal show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X