వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ... రాహుల్ పదవి నుండి తప్పుకున్నట్లేనా...?

|
Google Oneindia TeluguNews

గురువారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహు,ల్ గాంధీ కాకుండా యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ హజరవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుంటున్నాడా అనే సందేహాలు తలెత్తున్నాయి.ఇప్పటికే నాలుగు రోజులుగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ పలువురు నేతలు ఆయన ఇంటికి క్యూ కడుతున్న విషయం తెలిసిందే...

కాంగ్రెస్ పార్టీ కష్టాలు...

కాంగ్రెస్ పార్టీ కష్టాలు...

ఓవైపు అతి పెద్ద మెజారీటీ సాధించి తిరిగి రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవి బాద్యతలు చేపడుతున్నాడు. మరోవైపు ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్యలతో సతమతమవుతోంది. ఈనేపథ్యలోనే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నానని ప్రకటించారు. దీంతో గత నాలుగు రోజులుగా రాహుల్ గాంధీని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు చర్చోప చర్చలు జరుపుతున్నారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గినట్టుగా మాత్రం కనిపించడం లేదు.

రాహుల్‌కు బదులు సోనియా వెళుతున్నారా..

రాహుల్‌కు బదులు సోనియా వెళుతున్నారా..

ఇక ప్రధానమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాలతోపాటు స్వదేశంలోని పలు పార్టీ అధినేతలు, ఆయా రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు హజరుకానున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ హజరుకావాల్సిన అవసరం ఉంది. కాని పార్టీ తరఫున సోనియా గాంధీ హజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షపదవి నుండి తప్పుకున్నట్లేనా అనే సందేహాలు వెలువడుతున్నాయి.

2014లో కూడ రాజీనామ చేసిన సోనియా, రాహూల్ గాంధీలు

2014లో కూడ రాజీనామ చేసిన సోనియా, రాహూల్ గాంధీలు

కాగా 2014లో కూడ యూపిఏ చైర్ పర్సన్,ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 49 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో కనీసం ప్రతిపక్ష హోదాకూడ దక్కని పరిస్థితి ఎదురైంది. దీంతో ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి సోనియా గాంధీ రాజీనామ చేసింది. అయితే ఆమే రాజీనామను పార్టీ వర్కింగ్ కమిటి సభ్యులు అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో కూడ అదే పరిస్థితి రీపిట్ అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్త పరిచారు. కాని రేపు మోడీ ప్రమాణ స్వీకారానికి రాకపోవడంతో రాహుల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

English summary
Congress leader Sonia Gandhi will attend Prime Minister Narendra Modi's oath ceremony tomorrow, sources have said.It is not clear whether Rahul Gandhi, who has decided to quit as Congress president, will attend the grand event tomorrow at the presidential palace Rashtrapati Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X