వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీలో నేను కాదు, మా అమ్మే: సోనియాపై ప్రియాంక గాంధీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi Coronation : ఇందిరా, రాజీవ్‌ల బలిదానాలు వృథా కానివ్వొద్దు !

న్యూఢిల్లీ: తన తల్లి సోనియా గాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచే పోటీ చేస్తారని ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భర్త రాబర్ట్ వాద్రాతోపాటు ఆమె హాజయరయ్యారు.

శనివారం రాహుల్ గాంధీ 49వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు.

18నెలలే టైం! బీజేపీని ఢీకొట్ట గలరా?: రాహుల్ ముందున్న కీలక సవాళ్లివే18నెలలే టైం! బీజేపీని ఢీకొట్ట గలరా?: రాహుల్ ముందున్న కీలక సవాళ్లివే

నేను కాదు మా అమ్మే..

నేను కాదు మా అమ్మే..

ఈ సందర్భంగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘నేను రాయ్‌బరేలి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదు. నా తల్లే అక్కడ్నుంచి పోటీ చేస్తారు' అని ప్రియాంక వాద్రా తెలిపారు. 2019ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అత్యంత ధైర్యవంతురాలు

అత్యంత ధైర్యవంతురాలు

2004 నుంచి కూడా రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘నా తల్లి సోనియా నేనే చూసిన అత్యంత ధైర్యవంత మహిళల్లో ఒకరు'అని ప్రియాంక తెలిపారు.

సోనియా రిటైర్మెంట్ వ్యాఖ్యలు

సోనియా రిటైర్మెంట్ వ్యాఖ్యలు

రాజకీయాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతోందని శుక్రవారం కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. తాను రిటైర్ అవుతున్నట్లు సోనియా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోనియా స్థానంలో ప్రియాంక రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి.

సోనియా రిటైర్ కావడం లేదంటూ..

సోనియా రిటైర్ కావడం లేదంటూ..

అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం సోనియా రాజకీయాల నుంచి రిటైర్ కావడం లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచే తప్పుకుంటారని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ నుంచే లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. రాహుల్, సోనియాల నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ప్రచారం కూడా చేశారు.

English summary
Priyanka Gandhi Vadra, on the sidelines of her brother Rahul Gandhi's takeover today as Congress president, told NDTV that her mother Sonia Gandhi would contest the next national election from her constituency Rae Bareli in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X