వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండగా ఉంటాం: తీహార్ జైలులో డీకే శివకుమార్‌ను కలిసిన సోనియాగాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం కర్నాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను తీహార్ జైలులో కలిశారు. కష్టకాలంలో పార్టీ తనకు అండగా ఉంటుందనే సంకేతాలు పంపారు. డీకే శివకుమార్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సోనియా డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే తీహార్ జైలుకు వెళ్లడం సోనియాగాంధీకి ఇది రెండో సారి. గతనెలలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను ఆమె తీహార్ జైలులో కలిశారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

సోనియాగాంధీ కంటే ముందు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మలు డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్ జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు డీకే శివకుమార్ ఎంతో కృషి చేశారు. అయితే కుమారస్వామి ప్రభుత్వం ఎంతో కాలం అధికారం చేపట్టలేకపోయింది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్... సెప్టెంబర్ 3న మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్‌తో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ఈడీ ప్రశ్నించింది. వీరితో పాటు డీకే శివకుమార్ తల్లికి భార్యకు కూడా సమన్లు జారీ చేసింది. మరోవైపు కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొంటూ బెలగావి రూరల్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కార్‌‌కు కూడా నోటీసులు పంపింది ఈడీ.

Sonia meets DK Shiva Kumar in Tihar jail, sends a strong message

ప్రస్తుతం డీకే శివకుమార్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కింది కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ గతేడాది సెప్టెంబర్ మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌తో పాటు కర్నాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్యలపై కేసు నమోదు చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చార్జ్‌షీట్‌లో దాఖలు చేసిన అంశాలను ఆధారంగా చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. అందులో పన్ను ఎగవేత, కోట్లల్లో హవాలా లావాదేవీలు జరిపినట్లు ఇన్‌కంట్యాక్స్ గుర్తించింది.

English summary
Congress interim president Sonia Gandhi on Wednesday met party leader D K Shivakumar at the Tihar Jail in the national capital, sending out a clear message that the party is fully backing its Vokkaliga strongman from Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X