వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టును ఆశ్రయించిన సోనియా, రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై విచారణకు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై విచారణకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను రద్దు చెయ్యాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అయితే వీరు సమర్పించిన అర్జీని ఢిల్లీ హై కోర్టు కొట్టివేసింది.

Sonia, Rahul Gandhi moves Supreme Court against Delhi HC order

ఈ నేపధ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టులో వీరు సమర్పించిన పిటిషన్ల విచారణ జరగనుంది.

ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను కొట్టి వెయ్యాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. ఈనెల 20వ తేదిన ఈ కేసు విచారణ జరుగనుంది. ఈ నేపధ్యంలో తల్లి, కుమారుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

English summary
The development comes ahead of the next court hearing in the case that is February 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X