వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్‌

|
Google Oneindia TeluguNews

భారత జాతీయ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మంగళవారం దేశానికి తిరిగొచ్చారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా.. వైద్య పరీక్షల నిమిత్తం ఈనెల 12న రాహుల్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ''ఇవాళ ఉదయం ఏడు గంటలకు సోనియా, రాహుల్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. కొంత విశ్రాంతి తర్వాత అధినేత్రి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారు''అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..

పార్లమెంట్ నిరవధిక వాయిదా?

పార్లమెంట్ నిరవధిక వాయిదా?

అమెరికా పర్యటన కారణంగా సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనలేకపోయాయి. అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నా.. పలువురు ఎంపీలు, సిబ్బంది వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే, పార్లమెంట్ వాయిదాపై కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది.. వివాదాస్పద వ్యవసాయ బిల్లులను కేంద్రం గనుక వెనక్కి తీసుకుంటే.. సమావేశాల కొనసాగింపునకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లోక్ సభలో కాంగ్రెస్ పక్షనాయకుడైన అధిర్ రంజన్ చౌధరి అన్నారు.

షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్

బిల్లులపై పోరు ముమ్మరం..

బిల్లులపై పోరు ముమ్మరం..

కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఒక్కటై బిల్లులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో సోనియా, రాహుల్ గాంధీల పునరాగమనం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని నేతలు అంటున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనల్లో కాంగ్రెస్ శ్రేణులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే..

రాష్ట్రపతిపై విమర్శలు

రాష్ట్రపతిపై విమర్శలు


పార్లమెంటులో బీజేపీ అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నా.. నిబంధనలను బేఖాతరు చేస్తూ అప్రజాస్వామికంగా బిల్లుల్ని పాస్ చేయించుకున్నా.. దానిపై ప్రతిపక్ష ఎంపీలు ఫిర్యాదు చేసినా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కనీసమాత్రంగానైనా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రపతి మౌనంగా ఉండటం శోచనీయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు మార్లు రిక్వెస్ట్ చేసినా, అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రపతి నిరాకించారని తెలిపారు.

English summary
Congress president Sonia Gandhi accompanied by her son Rahul Gandhi returned to India on Tuesday morning after undergoing a routine health check-up in the United States, people familiar with the development said. The two had left for the US on September 12. Congress spokesperson Randeep Surjewala has slammed President Ram Nath Kovind for not speaking up 'when one party was annihilating the parliament protocols'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X