వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుపేదల కోసం సొంత ఆస్తులు తనఖా పెట్టిన సోనుసూద్ .. రూ .10 కోట్ల అప్పు చేసిన మరీ సాయం

|
Google Oneindia TeluguNews

రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్ గొప్ప మానవతావాదిగా ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి ఆదుకున్నారు. నిరుపేదలకు, అన్నార్ధులకు, ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడం కోసం సోను సూద్ తన దగ్గర ఉన్న డబ్బును సహాయం చేయడం మాత్రమే కాకుండా, తన ఆస్తులను కూడా తనఖా పెట్టి వచ్చిన డబ్బును సహాయం అందించడానికి వినియోగించారు అంటే అతని ఔదార్యం అర్థం చేసుకోవచ్చు.

యాహూ టాప్ మోస్ట్ సెర్చ్ సెలబ్రిటీలు 2020.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి .. హీరో ఆఫ్ ది ఇయర్ సోనూసూద్యాహూ టాప్ మోస్ట్ సెర్చ్ సెలబ్రిటీలు 2020.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి .. హీరో ఆఫ్ ది ఇయర్ సోనూసూద్

 ముంబైలో ఉన్న తన ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టి సాయం చెయ్యటానికి నిధుల సమీకరణ

ముంబైలో ఉన్న తన ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టి సాయం చెయ్యటానికి నిధుల సమీకరణ

నటుడు సోను సూద్ ముంబైలో ఉన్న తన ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టి పేదవారికి సహాయం చేయడానికి నిధులు సేకరించారని సమాచారం . ఈ సంవత్సరం సోను చేసిన సహాయాన్ని , అతని మానవతా దృక్పధానికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు . సోను సూద్ కూడా తాను అందించే సహాయం ఎక్కువ మందికి చేరేలా పని చేస్తున్నారు . ఎవరు అడిగితే వారికి కాదనకుండా , లేదనకుండా సహాయం చేస్తున్నారు. ఇంత మందికి సహాయం చేస్తున్న సోనూ సూద్ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు .

అక్షయపాత్ర లాంటి మనసున్న సోనుసూద్ .. 10 కోట్ల అప్పు చేసి మరీ ఎంతో మందికి సాయం

అక్షయపాత్ర లాంటి మనసున్న సోనుసూద్ .. 10 కోట్ల అప్పు చేసి మరీ ఎంతో మందికి సాయం

అయితే సోనూ సూద్ వద్ద అలాంటి అక్షయ పాత్ర ఏమీ లేదని , అక్షయ పాత్ర వంటి మంచి మనసు మాత్రమే ఉందని తాజాగా ఓ విషయం ద్వారా అర్ధం అవుతుంది.
సోను సూద్ ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యటం కోసం తన ఆస్తులను తనఖా పెట్టారని తెలుస్తుంది . రూ .10 కోట్ల రుణం కోసం ఆయన జుహులో ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టాడు. ఇందులో 6 ఫ్లాట్లు, రెండు షాపులు ఉన్నాయని సమాచారం . సొంత వాళ్ళే పది రూపాయల సాయం అంటే చెయ్యని ఈ రోజుల్లో తన కుటుంబమే కాకుండా అందరూ తనవాళ్ళే అని ప్రతి ఒక్కరి కష్టానికి చలించిన సోనుసూద్ అప్పు చేసి మరీ ఎందరికో సాయం చేశారు .

వలస కార్మికుల సాయంతో మొదలై నేటికీ కొనసాగుతున్న సాయం

వలస కార్మికుల సాయంతో మొదలై నేటికీ కొనసాగుతున్న సాయం

ఈ సంవత్సరం మార్చి నెల నుండి కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పుడు, వలస వచ్చిన కార్మికులకు ఇంటికి తిరిగి వెళ్ళడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో సోను సూద్ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ముందుకు వచ్చిన సమయంలో వారికి కావలసిన వనరులు సమకూర్చడం కోసం ఆయన తన ఆస్తులను తనఖా పెట్టినట్లుగా తెలుస్తోంది.

కరోనా సమయంలో ఆదాయం కోల్పోయిన సోనూ సూద్ .. అయినా సరే ఎందరికో అండగా

కరోనా సమయంలో ఆదాయం కోల్పోయిన సోనూ సూద్ .. అయినా సరే ఎందరికో అండగా

వలస కార్మికులు వాళ్ళ ఇళ్ళకు చేరడానికి బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర దేశాలలో ఉన్న వారు ఇండియాకు తిరిగి రావడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేశారు సోనుసూద్. కరోనా మహమ్మారి సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడింది. దాంతో ఆయన తన ఆదాయ మార్గాలను కూడా కోల్పోయారు . ఆ సమయంలోనే కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం కోసం ముందుకు వచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కూడా అందించాడు.

నేటికీ సోనూ సూద్ కు సాయం కోసం వందలాది ఉత్తరాలు

నేటికీ సోనూ సూద్ కు సాయం కోసం వందలాది ఉత్తరాలు

ఇప్పటికీ ప్రతి రోజూ సోను సూద్ సహాయం కోరి వందలాది లేఖలు వస్తుంటాయి. వాటన్నింటినీ చదివి సోను సూద్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసి, నాకు ప్రతిరోజూ అందుతున్న మెయిల్స్‌కు సహాయం చేయండి. నేను అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నాను, అది అసాధ్యం అనిపిస్తుంది. ఈ లేఖలు సంఖ్య తగ్గే రోజు కోసం ఎదురు చూస్తాను అంటూ పోస్ట్ చేసారు. ఏది ఏమైనా వందల కోట్లు సంపాదించిన అపర కుబేరుల సహాయం చేయడానికి ముందుకు రాని రోజుల్లో, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి తన ఆస్తులను కూడా తనఖా పెట్టిన సోనుసూద్ నిజంగా గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పక తప్పదు.

English summary
Actor Sonu Sood has mortgaged eight properties in Mumbai to raise funds to help the needy, . Sonu’s humanitarian work this year has been lauded by the people across the country and the actor is making sure that his help reaches more and more people. Sonu Sood has mortgaged eight properties in Juhu to raise Rs 10 crore loan. The actor has mortgaged two shops and six flats to raise the amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X