• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోను సూద్ పట్ల అభిమాని ప్రేమ .. 1200 కిలోమీటర్ల మేర సైకిల్ పై వెళ్లి ఆయనను కలిసిన ఫ్యాన్ , వీడియో వైరల్ !!

|

రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో, బాలీవుడ్ నటుడు సోనుసూద్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు పెరిగారు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి తన వంతు సహాయం అందించిన సోను సూద్ ను రియల్ హీరో గా కొనియాడుతున్నారు. ఇక తాజాగా సోను సూద్ అభిమానులలో ఒకరు ఆయనను కలవటానికి పూరీ నుండి 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి సోనూసూద్ ని కలిసి తన అభిమానాన్ని వ్యక్తంచేశారు.

సోనుసూద్ పై ఫ్యాన్ అభిమానం .. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

సోను సూద్ తన అభిమానిని కలిసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో, సింబా అనే పేరున్న అభిమాని సోనూసూద్ కు పూల దండను వేసే ప్రయత్నం చెయ్యగా సోను సూద్ ఆ దండను ఆ అభిమానికే వేశాడు. ఆయనపై ఉన్న తన గౌరవానికి చిహ్నంగా సోను సూద్ పాదాల వద్ద పూలు ఉంచి సోనూసూద్ పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చెయ్యగా వద్దని వారించారు .

అయినా అభిమాని తన అభిమాన హీరో పాదాలపై పూలను చల్లాడు. తనపై ఇంత అభిమానం వ్యక్తం చేసిన, అభిమాని పట్ల సోనూసూద్ కూడా అంతే అభిమానం చూపించారు. అతని మెడలో దండ వేసి, అతని గురించి అడిగి తెలుసుకున్నారు.

సోను సూద్ కు రోజురోజుకూ పెరుగుతున్న ఫ్యాన్స్

సోను సూద్ కు రోజురోజుకూ పెరుగుతున్న ఫ్యాన్స్


సోనూసూద్ పట్ల అభిమానులు ఈ విధమైన ప్రేమను వ్యక్తం చేయడం మొదటిసారి కాదు. అంతకుముందు ఆయన అభిమానుల్లో ఒకరు ఆయనను కలవడానికి హైదరాబాద్ నుండి ముంబై వరకు నడిచి వెళ్లారు. మరొక అభిమాని, సోను సూద్ చిత్రాన్ని, అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కోవిడ్ -19 తో జరిగిన దేశ యుద్ధంలో సోను సూద్ ముందంజలో ఉన్నారు. గత సంవత్సరం, అతను మొదటి లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి స్వగ్రామాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు.

నటుడిగా కంటే సహాయం చెయ్యటంలో ఆనందం దొరికిందన్న సోను సూద్

నటుడిగా కంటే సహాయం చెయ్యటంలో ఆనందం దొరికిందన్న సోను సూద్


వలస కార్మికుల కోసం బస్సులు మరియు రైళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఒంటరిగా ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి సహాయం చేశారు. ఈ ఏప్రిల్‌లో కరోనావైరస్ యొక్క రెండవ వేవ్ సమయంలో కూడా , సూద్ దేశవ్యాప్తంగా రోగులకు ఆస్పత్రులలో బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర వైద్య సేవలను ఏర్పాటు చేశాడు.
ఇక సోను సూద్ తాను చేస్తున్న సహాయ సహకారాలను ఉద్దేశించి మాట్లాడుతూ నటుడిగా 19 సంవత్సరాల కెరీర్ కంటే ఇతరులకు సహాయం చేయడం తనకు ఎక్కువ ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు.

తాను ఇంత దూరం సహాయ కార్యక్రమాలు చేస్తాననుకోలేదని పేర్కొన్న సోను సూద్

తాను ఇంత దూరం సహాయ కార్యక్రమాలు చేస్తాననుకోలేదని పేర్కొన్న సోను సూద్


మొత్తం ప్రయాణం ఒకటిన్నర సంవత్సరాల క్రితం వలసదారులతో ప్రారంభమైనప్పుడు, తాను చాలా మంది జీవితాలతో కనెక్ట్ అవుతానని అనుకోలేదని కష్టకాలంలో మీతో ఎవరు నిలబడతారో వారే మీకు గొప్ప వ్యక్తి అని తన తల్లి చెప్పేది అని పేర్కొన్నారు సోనూ సూద్ . నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను, కాని నేను సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ నా తల్లిదండ్రులను చూస్తున్నానని సోనూ సూద్ చెప్పడం గమనార్హం.

English summary
Bollywood actor Sonu Sood one of his fans cycled 1200 km to meet him in Mumbai and expressed his love for him. A video of Sood meeting his fan went viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X