• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్ : సోను సూద్ పై ఐటీ నజర్ .. hyd సహా 6 చోట్ల తనిఖీలు; ఆ సీఎంతో భేటీ తర్వాత ..

|

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు ఎంతగానో సహాయం చేసిన, వలస కార్మికుల పాలిట దేవుడిగా, రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్ నివాసాలపై, ఆయన కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. ముంబైలోని నటుడు సోనూసూద్ నివాసాలను మరియు లక్నోలోని ఒక కంపెనీలో మొత్తం ఆరు చోట్ల ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేసింది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ తో సహా ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.

కేజ్రీవాల్ తో సమావేశం తర్వాత సోనుసూద్ కార్యాలయంపై ఐటీ తనిఖీలు

కేజ్రీవాల్ తో సమావేశం తర్వాత సోనుసూద్ కార్యాలయంపై ఐటీ తనిఖీలు


పాఠశాల విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వ మార్గదర్శక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన నటుడు సోను సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమైన కొన్ని రోజుల తర్వాత ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం తర్వాత, సోనూ సూద్ రాజకీయాల్లో చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. కేజ్రీవాల్ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో చేరబోతున్నారా అన్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడానికి సోను సూద్ నిరాకరించారు.

JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

కరోనా సమయంలో సహాయం చేసిన రియల్ హీరో సోను సూద్

కరోనా సమయంలో సహాయం చేసిన రియల్ హీరో సోను సూద్

48 ఏళ్ల నటుడు సోను సూద్ కరోనా మహమ్మారి సమయంలో తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మన్ననలు పొందాడు. ముఖ్యంగా గత సంవత్సరం లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలసదారుల కోసం ప్రత్యేక విమానాలను, బస్సులను ఏర్పాటు చేసి, వలస కార్మికులను ఇళ్లకు చేర్చటం కోసం ఎంతగానో తపించాడు .సోను సూద్ యొక్క మానవతా దృక్పథం, సామాన్య ప్రజానీకం కోసం ఆయన చేసిన కృషి సోనూసూద్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. ఇప్పటికీ నిత్యం అనేకమంది ప్రతిరోజూ సహాయం కోసం సోను సూద్ సోషల్ మీడియా ఖాతాలకు, సూద్ ఫౌండేషన్ కు తమ అభ్యర్థనలను పంపుతున్నారు అంటే ఆయన ఎంతగా సేవలను అందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం .. ఆపై ఐటీ దాడులు

సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం .. ఆపై ఐటీ దాడులు

ఇక నటుడు, మానవతావేత్త సోను సూద్ రాజకీయాల్లో చేరడానికి ఎప్పుడూ మొగ్గు చూపలేదు కానీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ తర్వాత సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఊహాగానాలు చెలరేగాయి . వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో నటుడు పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి. అయితే సోనూసూద్ కార్యాలయంపై, ఆయన నివాసాలపై, మొత్తంగా ఆరు స్థలాలలో ఏకకాలంలో తనిఖీలు జరిపారు ఐటీ అధికారులు.

YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)

దాడులకు , కేజ్రీవాల్ ను కలవటానికి సంబంధం లేదన్న బీజేపీ నేతలు

దాడులకు , కేజ్రీవాల్ ను కలవటానికి సంబంధం లేదన్న బీజేపీ నేతలు

సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు పై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భమ్లా సోనుసూద్ కేజ్రీవాల్ ని కలవడానికి ఐటీ దాడులకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. దేశంలో ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం తనిఖీ మాత్రమేనని, దాడి కాదని స్పష్టం చేశారు. స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి ఏదైనా తప్పు చేయాల్సిన అవసరం లేదని, క్రింది స్థాయిలో ఏం జరిగిందో, ఏం ఉప్పందిందో, ఎందుకు తనిఖీలు చేశారో తెలియదని అభిప్రాయపడ్డారు.

ఆదాయపు పన్ను శాఖ స్వతంత్ర విభాగం అన్న బీజేపీ నేత

ఆదాయపు పన్ను శాఖ స్వతంత్ర విభాగం అన్న బీజేపీ నేత

ఆదాయపు పన్ను అనేది ఒక స్వతంత్ర విభాగం, దానికి స్వంత ప్రోటోకాల్ ఉంది. అది తన పనిని చేస్తోంది అని బిజెపి అధికార ప్రతినిధి ఆసిఫ్ భమ్లా అన్నారు.నటుడు సోను సూద్ పార్టీ పరంగా మాత్రమే కాకుండా ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నారని మిస్టర్ భమ్లా చెప్పారు. అయితే సోనూ సూద్ కార్యాలయంలో, ఆయనకు సంబంధించిన స్థలాలలో ఆదాయపు పన్నుల శాఖ తనిఖీలు చెయ్యటంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలని కేంద్ర సంస్థతో చేయించిన కేంద్ర ప్రభుత్వ చర్యగా అభివర్ణించారు.

 సోనుసూద్ పై ఆదాయపు పన్ను తనిఖీలపై ఆప్, శివసేన నేతల ఆగ్రహం

సోనుసూద్ పై ఆదాయపు పన్ను తనిఖీలపై ఆప్, శివసేన నేతల ఆగ్రహం

ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఇలా అన్నారు. సోను సూద్ వలె నిజాయితీగా ఉన్న వ్యక్తిపై ఐటీ దాడి, లక్షలాది మంది దేవుడిగా పిలువబడే వ్యక్తి, అణగారిన వర్గాలకు సహాయం చేసిన వ్యక్తి. ఆయనలాంటి వ్యక్తి రాజకీయంగా మంచి ఆలోచనలో ఉంటే కేంద్రం భయపెట్టేలా ఏదో చెయ్యాలని చూస్తుందని అన్నారు . సోను సూద్ లక్షలాది మందికి సహాయం చేశాడని , ఆయన గొప్ప మానవతావాది అని, ఆయన చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తాడని తాము అనుకోమని అని శివసేన నాయకుడు ఆనంద్ దుబే అన్నారు.

English summary
The Income Tax Department surveyed Sonu Sood's residences and his office. The Income Tax Department has inspected the residences of actor Sonu Sood in Mumbai and a total of six places in a company in Lucknow. The tax survey comes days after the actor's much-speculated meeting with Delhi Chief Minister Arvind Kejriwal, who declared him the brand ambassador for the Delhi government's mentorship programme for school students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X