• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోటీలు చేసి, జ్యూస్ అమ్ముతూ సోను సూద్ .. చిరు వ్యాపారిగా మారిన రియల్ హీరో .. రీజన్ ఇదే

|

నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా, రియల్ హీరోగా , కరోనా కష్టకాలంలో ఆదుకున్న ఆపద్బాంధవుడిగా దేశవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు పొందిన సోనుసూద్ తనదైన శైలిలో సహాయం చేయడంలో తన స్పెషాలిటీ ని చాటుకుంటున్నారు. తాజాగా రిక్షావాలానే రిక్షా ఎక్కించుకొని తాను రిక్షావాలాగా మారి సామాన్యుల్లో సామాన్యుడిగా అందరూ ఒకటే అన్న భావనను వ్యక్తం చేసిన సోను సూద్, చిరు వ్యాపారులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను మొదలుపెట్టారు.

  Sonu Sood Making Orange Juice At Hyderabad, Video Goes Viral | Oneindia Telugu

  సోను సూద్ పట్ల అభిమాని ప్రేమ .. 1200 కిలోమీటర్ల మేర సైకిల్ పై వెళ్లి ఆయనను కలిసిన ఫ్యాన్ , వీడియో వైరల్ !!సోను సూద్ పట్ల అభిమాని ప్రేమ .. 1200 కిలోమీటర్ల మేర సైకిల్ పై వెళ్లి ఆయనను కలిసిన ఫ్యాన్ , వీడియో వైరల్ !!

   చిరు వ్యాపారులను ప్రమోట్ చేస్తున్న సోను సూద్

  చిరు వ్యాపారులను ప్రమోట్ చేస్తున్న సోను సూద్

  చిరు వ్యాపారులను ప్రమోట్ చేసే పనిలో భాగంగా సోనూసూద్ వారి కోసం ఫ్రీగా ప్రచారం మొదలుపెట్టారు. రొట్టెలు చేస్తూ, జ్యూస్ తయారు చేసి విక్రయిస్తూ చిరు వ్యాపారాలను ప్రమోట్ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది చిరువ్యాపారులు జీవితాలు రోడ్డున పడడంతో వారి కోసం రంగంలోకి దిగిన సోను సూద్ స్వయంగా రోడ్లపై ఉన్న బండ్ల దగ్గరకు వెళ్లి వారి కోసం బిజినెస్ చేస్తున్నారు. ఓ చిరు వ్యాపారి కి సంబంధించిన బండి వద్ద రోటీలు చేసి తాను చేసిన రోటీలు తిన్నవారు మళ్లీ ఇంకెక్కడా తినలేరని కామెంట్లు జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  రోటీలే కాదు .. జ్యూస్ తయారు చేసి విక్రయించిన రియల్ హీరో

  రోటీలే కాదు .. జ్యూస్ తయారు చేసి విక్రయించిన రియల్ హీరో

  అంతేకాదు తాజాగా హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఏరియాలో రోడ్ నెంబర్ త్రీ లో ఉన్న జ్యూస్ షాప్ దగ్గరకు సోనూసూద్ వెళ్లి, అక్కడ తానే సొంతంగా జ్యూస్ తయారు చేసి జ్యూస్ విక్రయించారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని, జ్యూస్ తాగడానికి వచ్చినవారికి సోను సూద్ సూచించారు. తమ వ్యాపారాల కోసం సోను సూద్ చూపిస్తున్న శ్రద్ధకు చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఎవరూ పట్టించుకోవటం లేదని, కానీ సోను సూద్ రూపంలో దేవుడు తమ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారని వారు అంటున్నారు.

   కరోనా కారణంగా కుదేలైన చిరు వ్యాపారులు .. వారికి అండగా సూద్

  కరోనా కారణంగా కుదేలైన చిరు వ్యాపారులు .. వారికి అండగా సూద్

  కరోనా మహమ్మారి కారణంగా చాలామంది చిరు వ్యాపారులు కుదేలు అయ్యారు. వ్యాపారాలు చెయ్యలేని దయనీయమైన పరిస్థితులకు చేరుకున్నారు. ప్రస్తుతం తిరిగి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఆదుకునేవారు లేక, వ్యాపారాలు సాగక చిరు వ్యాపారులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇక అలాంటి వారికి తాను బాసటగా ఉంటానని రంగంలోకి దిగారు సోనూసూద్. అందుకే చిరువ్యాపారులు దుకాణాలకు నేరుగా వెళ్లి కాసేపు వాళ్ళ వ్యాపారాన్ని తాను కొనసాగించి, చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని రియల్ హీరో సోనూసూద్ ప్రమోట్ చేస్తున్నారు.

  ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న వ్యక్తిగా ..సహాయంలోనూ తన మార్క్

  ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న వ్యక్తిగా ..సహాయంలోనూ తన మార్క్

  సోషల్ మీడియా వేదికగా సూద్ పౌండేషన్ కు సహాయం కోసం పంపించిన విజ్ఞప్తులను పరిశీలిస్తూనే, వారికి కావలసిన సహాయ సహకారాలను అందిస్తూనే ప్రజాక్షేత్రంలోనూ తన మార్క్ సామాజిక సేవా దృక్పథంతో ముందుకు దూసుకుపోతున్నారు సోనుసూద్. దీంతో ఆయనకు సినిమాల్లో వచ్చిన ఇమేజ్ కంటే, సామాజిక కార్యక్రమాలతో వస్తున్న ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సినిమా స్టార్లు అందరూ సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుంటే, దేశంలో చాలా మంది పేద ప్రజల కష్టాలు తీరుతాయని బయట టాక్ వినిపిస్తుంది.

  English summary
  As part of its efforts to promote small businesses, and street vendors Sonu Sood has launched a free campaign for them. Promoting small businesses making rotis, making and selling juices. Sonu Sood, who took to the field for the lives of many street vendors, during the Corona crisis, himself goes to the shops on the roads and does business for them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X