వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనూసూద్ చెప్పిన కథ: 7 లక్షలకు పైగా మందికి సాయం.. విమర్శకుల కామెంట్లకు కౌంటర్..

|
Google Oneindia TeluguNews

సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఎందరికో సాయం చేసిన గొప్ప మనస్సున్న మంచి మనిషి. ఆపదలో ఉన్నామని చెబితే చాలు సాయం చేశారు. అయితే అలాంటి వారిని కూడా విమర్శించేవారు ఉంటారు. కామనే.. అలానే కొందరు సోనూసూద్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆయన ఏదో ఆశించి.. ఇదంతా చేశారని కామెంట్ చేశారు. దీనిపై సోనూసూద్ కూడా అంతేస్థాయిలో బదులిచ్చారు. విమర్శకులకు అర్థమయ్యేలా ఓ కథ కూడా చెప్పారు.

సోనూ చెప్పిన కథ..

సోనూ చెప్పిన కథ..


తన చిన్నతనంలో ఓ కథ విన్నానని సోనూసూద్ తెలిపాడు. సాధువు వద్ద గుర్రం ఉండేదని వివరించారు. అయితే ఓ దొంగ అడగగా సాధువు ఇవ్వలేదు. కానీ కొంతదూరం వెళ్లాక.. నడవలేక ఉన్న ముసలి సాధువుకు కనపిస్తాడు. అతనిని చూసి సాధువు జాలి పడి.. ముసలి వ్యక్తికి గుర్రాన్ని ఇచ్చేస్తాడు. అయితే గుర్రం ఎక్కిన తర్వాత ముసలి స్వరూపం మారుతోంది. బిగ్గరగా నవ్వి తానే దొంగనని చెబుతాడు. అయినప్పటికీ గుర్రాన్ని తీసుకోవాలని సాధువు కోరతాడు. కానీ గుర్రాన్ని తీసుకున్న విధానాన్ని మాత్రం ఎవరికీ చెప్పొద్దని కోరతాడు. ఒకవేళ విషయం తెలిస్తే మిగతా వారు సాయం చేయడం మానేస్తారని చెబుతాడు.

ఇదీ రియాలిటీ..

ఇదీ రియాలిటీ..

అదీ కథ.. ఇదీ రియాలిటీ.. మీకు అదే చెబుతున్నా.. విమర్శలతో మీకు వేతనం వస్తోంది కావచ్చు.. మీరు అలా చేయొచ్చు తప్పులేదన్నారు. కానీ మీ మాటలు తనపై ప్రభావం చూపదని.. తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తానని సోనూ సూద్ స్పష్టంచేశారు. విమర్శలకు కథతో చెంపపై కొట్టినట్టు సమాధానం ఇచ్చారు సోనూ సూద్. అంతటితో ఆగక.. తాను 7 లక్షల పై చిలుకు మందికి సాయం చేశానని వివరించారు.

7 లక్షలకు పైగా మందికి సాయం..

7 లక్షలకు పైగా మందికి సాయం..


7 లక్షల 3 వేల 246 మందికి సాయం చేశానని సోనూ సూద్ వివరించారు. వారి అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. విదేశాల నుంచి స్వదేశం తిరిగి వచ్చేందుకు సాయం చేసిన విద్యార్థులు వివరాలు కూడా తన వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. తనను విమర్శించిన వారికి సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు. కానీ తనను విమర్శించే బదులు ఇతరులకు సాయం చేయాలని కోరారు.

Recommended Video

Kaloji Narasimha Rao Biography | Kaloji Narasimha Rao Inspiring Story || Oneindia Telugu
రాజకీయాల్లోకి.. అబ్బే కాదు

రాజకీయాల్లోకి.. అబ్బే కాదు

అయితే సోనూ సూద్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకోసమే సాయం చేస్తున్నారని అంటున్నారు. కానీ తాను రాజకీయాల్లోకి రాను అని సోనూ సూద్ స్పష్టంచేశారు. నటనలో తాను ఉన్నత శిఖరాలు చేరాల్సి ఉంది అని పదే పదే చెబుతున్నారు.

English summary
sonu sood told story who criticize him for helping issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X