వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: మొబైల్ నెంబర్లలో మార్పులు, జూలై నుండి 13 అంకెల నెంబర్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

13 Digit Mobile Numbers For M2M Customers Only

న్యూఢిల్లీ: త్వరలోనే సెల్‌ఫోన్లకు 13 అంకెల నెంబర్లు రానున్నాయి. కేంద్ర టెలికం శాఖ టెలికం ఆపరేటర్లను 13 అంకెల నెంబర్లను వినియోగదారులకు కేటాయించాలని కోరింది. త్వరలోనే 13 అంకెల సెల్‌ఫోన్ నెంబర్లు అందుబాటులోకి రానున్నాయని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి చెప్పారు.

సెల్‌ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ ఇచ్చేందుకు గాను 13 అంకెల నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర టెలికం శాఖ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు టెలికం శాఖ 13 అంకెల నెంబర్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే ప్రస్తుతం అందరి మొబైల్ నెంబర్లు 10 అంకెలకే పరిమితం . అయితే ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రస్తుతం మనుగడలో ఉన్న 10 అంకెల నెంబర్లన్నీకూడ 13 అంకెల జాబితాలోకి మార్చబడతాయి.ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ 31,వ తేది నాటికి పూర్తి చేయాలని కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ప్లాన్ చేస్తోంది.

మరింత భద్రత కల్పించేందుకే

మరింత భద్రత కల్పించేందుకే

సెల్‌ఫోన్ వినియోగిస్తున్న వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకే ప్రస్తుతం 10 అంకెలుగా ఉన్న మొబైల్ నెంబర్లను 13 అంకెలుగా మార్చాలని కేంద్ర టెలికం శాఖ నిర్ణయం తీసుకొంది. దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు... 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది.

జూలై నుండే 13 అంకెల నెంబర్లు

జూలై నుండే 13 అంకెల నెంబర్లు

2018 జూలై నుండే టెలికం శాఖ కొత్తగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు 13 అంకెల నెంబర్లను కేటాయించనుంది. ఈ ఏడాది జూలై నుండి కొత్తగా ఫోన్ కనెక్షన్ తీసుకొనే వారికి 13 అంకెల నెంబర్లు మాత్రమే కేటాయించనున్నారు. ఈ మేరకు టెలికం శాఖ 13 అంకెల నెంబర్లను జారీ చేసేందుకు కసరత్తును ప్రారంభించింది.

ఇండియానే రికార్డు

ఇండియానే రికార్డు

ఇప్పటివరకు చైనాలో 11 అంకెలున్న మొబైల్ నెంబర్లను వాడుతున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యధిక అంకెలున్న మొబైల్ నెంబర్లుగా ఖ్యాతి చెందింది. అయితే ఇండియా 13 అంకెలు ఉన్న నెంబర్లను ఉపయోగిస్తే ఇండియాలోనే ఎక్కువ అంకెలతో మొబైల్ నెంబర్లున్న దేశంగా రికార్డు సృష్టించనుంది. దేశానికి చెందిన కోడ్ కలిపితే ఇండియాలో మొబైల్ ఫోన్ నెంబర్ 15 అంకెలకు చేరుకొంటుంది.

ట్రాయ్ ఆమోదం

ట్రాయ్ ఆమోదం


13 అంకెల మొబైల్ నెంబర్ల విధానానికి ట్రాయ్ ఆమోద ముద్ర వేసిందని టెలికం వర్గాలు తెలిపాయి.13 అంకెల మొబైల్ నెంబర్లను గుర్తించుకోవడం సాధ్యం కాదు. అయితే భద్రత పరమైన కారణాల రీత్యా అనివార్యంగా 13 నెంబర్లను మార్చాల్సి వచ్చిందని టెలికం వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవలనే ఆధార్‌తో ఫోన్ నెంబర్లను లింక్ చేసుకొన్నారు. అయితే ఆధార్ తో లింక్ చేసుకొన్న మొబైల్ నెంబర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడ ఉత్పన్నమౌతోంది.

English summary
The Department of Telecom (DoT) had reportedly issued a directive to all the telecom operators in India, asking them to start issuing 13-digit mobile numbers to customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X