వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి జియా మరణానికి సూరజే కారణం: సిబిఐ

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ సూరజ్‌ పంచోలీ తన స్నేహితురాలు, నటి జియాఖాన్‌కు తప్పుడు హామీలు ఇచ్చాడని.. ఇలా 2013లో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి పురికొల్పాడని సిబిఐ తన అభియోగపత్రంలో పేర్కొంది. జియా జీవితాన్ని సూరజ్‌ నాశనం చేసినట్టు ఆమె రాసిన లేఖ ద్వారా వెల్లడైందని తెలిపింది.

ఈ కేసులో సిబిఐ రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. 'మనం ఏడాది తర్వాత నిశ్చితార్థం చేసుకోబోతున్నామని నువ్వు నాకు వాగ్దానం చేశావు' అని జియా తన లేఖలో (సూసైడ్ నోట్) రాశారని పేర్కొంది. దీంతో ఆమె సూరజ్‌తో మానసిక అనుబంధాన్ని పెంచుకుందని వివరించింది.

ఉద్దేశపూర్వకమైన అతడి ప్రవర్తన ఆమెను ఆత్మహత్య చేసుకోవటానికి పురికొల్పిందని, అందువల్ల సూరజ్‌ శిక్షకు అర్హుడని తేల్చి చెప్పింది. 2012లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన జియా, సూరజ్‌లు.. ఆమె మరణించేంతవరకు (2013, జూన్‌ 3) కలిసే ఉన్నారు. వారి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని సిబిఐ అభియోగపత్రం పేర్కొంది.

 Sooraj Pancholi Drove Jiah Khan To Suicide With False Promise: CBI Chargesheet

జియా లేఖ ఆమె మానసిక స్థితి, పరిస్థితులు, ఆత్మహత్య వెనక గల కారణాన్ని బయటపెట్టాయని తెలిపింది. మూడు పేజీల లేఖలో ఆమె సూరజ్‌తో తనకు గల సన్నిహిత సంబంధాన్ని, శారీరక వేధింపులు, మానసిక, శారీరక హింస వంటి పలు అంశాలను ప్రస్తావించింది.

లేఖపై జియా సంతకం చేయకపోయినా, సూరజ్‌ పేరు పెట్టి రాయకపోయినా.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇది సూరజ్‌నే వెలెత్తి చూపిస్తోందని పేర్కొంది. జియా ఆత్మహత్య వెనక గల కారణానికి సంబంధించిన సమాచారాన్ని సూరజ్‌ దాచిపెడుతున్నట్టు అతడి మాటలను బట్టి తెలుస్తోందని తెలిపింది.

జియా ఆత్మహత్య చేసుకున్న రోజున ఆమె ఇంటి వద్ద అజ్ఞాత వ్యక్తులు గానీ, అనుమానిత వ్యక్తులు గానీ సంచరించినట్టు సిసిటీవీ దృశ్యాల్లో ఎక్కడా కనబడలేదని సిబిఐ వివరించింది.

English summary
While Jiah Khan's family and lawyers are upset with the CBI's decision to book actor Sooraj Pancholi only for abetment to suicide and not murder, the chargesheet filed by the central agency details why it believes the actor pushed Jiah Khan to take her own life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X