వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు సర్టిఫికేట్లు: గంగూలీ అకాడమీపై నిషేధం

|
Google Oneindia TeluguNews

Sourav Ganguly
కోల్‌కతా: ఆటగాళ్ల వయస్సు విషయంలో మోసానికి పాల్పడ్డట్లు తేలడంతో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి చెందిన కోచింగ్ సెంటర్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 13 కోచింగ్ సెంటర్లపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఏడాది నిషేధం విధించింది. ఇందులో బెంగాల్ జట్టు మాజీ కెప్టెన్ సంబరన్ బెనర్జీకి చెందిన రెండు అకాడమీలు కూడా ఉన్నాయి.

వయో పరిమితి క్రికెట్లో తప్పుడు ధృవపత్రాలతో వయస్సును తక్కువ చూపారన్న కారణంతో 42 మంది ఆటగాళ్లపైనా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రెండేళ్లపాటు నిషేధం విధించింది. వయసు విభాగాల్లో జరిగే క్రికెట్ టోర్నీల్లో ఈ జాడ్యాన్ని అరికట్టేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే చాలా కఠినంగా ఉంటామని, కోచింగ్ సెంటర్లపై జీవిత కాల నిషేధం, ఆటగాళ్లపై పదేళ్ల నిషేధం విధిస్తామని క్యాబ్ హెచ్చరించింది. సెప్టెంబర్ నెలలో జరిగిన అండర్-14 సబ్ జూనియర్, అండర్-17 జూనియర్ టోర్నమెంట్లలో ఆటగాళ్ల వయస్సులపై విచారణ జరిపిన క్యాబ్ గురువారం ఈ నిర్ణయం ప్రకటించింది.

క్యాబ్ తనిఖీ చేస్తుందన్న ఉద్దేశంతో ఆటగాళ్ల ధృవపత్రాలను తాము తనిఖీ చేయకుండా వదిలేశామని సాల్ట్‌లేక్‌లోని సౌరవ్ గంగూలీ అకాడమీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు.

English summary
After being found guilty of fudging age, two cricket coaching centres run by former India captain Sourav Ganguly and former Bengal skipper Sambaran Banerjee were among 13 which were banned by the Cricket Association of Bengal for one-year today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X