వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదం నుంచి బయటపడిన గంగూలీ భార్య
కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కోల్కతాలోని బెహలా చౌరస్తాలో ఆమె ప్రయాణిస్తున్న కారును భారీ లోడుతో ఉన్న ట్రక్కు ఢీకొంది.
తమ కుమార్తెను స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు డోనా మెర్సెడెజ్ బెంజ్ కారులో వెళ్తుండగా శుక్రవారంనాడు జేమ్స్ లాంగ్ సరానీ వద్ద అకస్మాత్తుగా వచ్చిన ట్రక్కు వెనుకనుంచి ఢీ కొట్టింది.

దీంతో కారు ధ్వంసమైంది. ఆమె మాత్రం ఏ గాయాలూ లేకుండా బయటపడ్డారు. ఠాకూర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
శ్రీమతి గంగూలీ గాయాలు కాకుండా బయటపడ్డారని, కారు ధ్వంసమైందని విశ్వసనీయమైన వర్గాలు చెప్పాయి.