వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్‌ మనీ ఆగిందనే వారి బాధ: వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించడంపై ప్రధాని మోడీ నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారంతా రైతులను అవమానించేవారనని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాక్టర్‌ను తగలబెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయం చేసే రైతులను,వారి ప్రయోజనాలు కోసం చేసిన చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా చైనాకు చెక్ పెట్టేందుకు మోడీ ప్లాన్: డెన్మార్క్ ప్రధానితో దైపాక్షిక చర్చలు అంతర్జాతీయంగా చైనాకు చెక్ పెట్టేందుకు మోడీ ప్లాన్: డెన్మార్క్ ప్రధానితో దైపాక్షిక చర్చలు

దేశ ప్రజల కోసం సంస్కరణలు

దేశ ప్రజల కోసం సంస్కరణలు

ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించిన పలు సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని వివరించారు. ఈ సంస్కరణలు దేశంలోని కార్మికులు, యువత, మహిళలు, రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అండగా ఉంటాయని నరేంద్ర మోడీ తెలిపారు.

తమ స్వార్థం కోసం కొందరు రైతులను అవమానించారు

తమ స్వార్థం కోసం కొందరు రైతులను అవమానించారు

కానీ, కొందరు తమ స్వార్థం కోసం ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. వ్యవసాయదారులు పూజించే యంత్రాలు, పనిముట్లను తగలబెట్టడం ద్వారా రైతులను వారు అవమానిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు స్వేచ్ఛ వారికి ఇష్టం లేదు.. బ్లాక్ మనీ ఆగిందనే బాధే..

రైతులకు స్వేచ్ఛ వారికి ఇష్టం లేదు.. బ్లాక్ మనీ ఆగిందనే బాధే..

కనీస మద్దతు ధర లేదా ఎంఎస్పీపై వ్యవసాయ బిల్లులపై రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఎంఎస్పీనే కాదు, రైతులకు తమ పంటను ఎక్కడైనా ఎక్కువ ధరకు అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఉండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, కొందరు మాత్రం రైతులకు లభించిన ఈ స్వేచ్ఛతో మింగుడుపడటం లేదని అన్నారు. ఎందుకంటే, వారికి వచ్చే నల్ల ధనం ఆగిపోయిందనే బాధతోనేనని అన్నారు.

Recommended Video

థాంక్యూ CM Jagan గారూ.. ఇది భారతీయుల కోరిక అంటూ Kamal Haasan ప్రశంస! || Oneindia Telugu
ఢిల్లీ గేట్ వద్ద ట్రాక్టర్ తగలబెట్టిన యూత్ కాంగ్రెస్..

ఢిల్లీ గేట్ వద్ద ట్రాక్టర్ తగలబెట్టిన యూత్ కాంగ్రెస్..

కాగా, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ సోమవారం ఓ ట్రాక్టర్‌ను ఇండియా గేట్ వద్ద నిప్పుపెట్టి దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రపతి భవన్‌కు వందల కిలోమీటర్ల దూరంలోనే కావడం గమనార్హం.తాము ప్రభుత్వంలో లేమని, అందుకే వీధుల్లోనే నిరసనలు తెలుపుతున్నామని పంజాబ్ యూత్ కాంగ్రెస్ నేత ధిల్లాన్ తెలిపారు. వినపడని, కనపడని ప్రభుత్వానికి తెలియాలనే ఈ చర్యకు పూనుకున్నామని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు పంజాబ్ వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారు వచ్చిన కారును సీజ్ చేశారు.కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఆ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడం, రాష్ట్రపతి కూడా వాటిపై ఆమోద ముద్ర వేయడం జరిగిపోయింది. దీంతో అవి చట్టాలుగా మారిపోయాయి.

English summary
"Those opposing farm laws are insulting farmers," Prime Minister Narendra Modi said today, hitting out at the opposition a day after Punjab Youth Congress workers set a tractor on fire near India Gate in the heart of Delhi during protests against the controversial farm laws, which have triggered widespread agitations in several states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X