శశికళకు భారీ దెబ్బ: ఒకే గ్రూప్ గా తమిళనాడు సీఎం, పన్నీర్ సెల్వం, అందుకే !

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇంత కాలం చిన్నమ్మ శశికళ విధేయులుగా ఉన్న సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడానికి రంగం సిద్దం చేస్తున్నారని వెలుగుచూసింది.

తెర వెనకు శశికళ, ఆమె అక్క కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ కు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు మంతనాలు జరుపుతున్నారని ఆదివారం విశ్వసనీయంగా వెలుగు చూసింది.

ఆ ఇద్దరి ప్రవర్తనతో విసిగిపోయి

ఆ ఇద్దరి ప్రవర్తనతో విసిగిపోయి

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తూ తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న శశికళకు ఇక కచ్చితంగా సినిమా చూపించాలని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారని సమాచారం.

రెచ్చిపోతున్న దినకరన్. నలిగిపోతున్న నేతలు

రెచ్చిపోతున్న దినకరన్. నలిగిపోతున్న నేతలు

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ సీనియర్ నేతలను లెక్కచెయ్యకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, సొంత పార్టీ నేతల పదవులకే ఎసరుపెడుతున్నారని తమిళనాడు మంత్రులు మండిపడుతున్నారు.

వారిద్దరినీ కలిపేస్తే సరిపోతుంది

వారిద్దరినీ కలిపేస్తే సరిపోతుంది

అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల నేతలు కలిసిపోతేనే మేలు అని నిర్ణయించారని సమాచారం. పన్నీర్ సెల్వం వర్గం, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం ఇప్పటికే శశికళకు వ్యతిరేకంగా రహస్యంగా చర్చలు జరుపుతున్నారని ఆదివారం విశ్వసనీయంగా తెలిసింది.

అదే జరిగితే శశికళ జైలుకే పరిమితం

అదే జరిగితే శశికళ జైలుకే పరిమితం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి శశికళ, టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. అదే జరిగితే తమిళనాడు రాజకీయ పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది.

విసిగిపోయిన నేతలు

విసిగిపోయిన నేతలు

శశికళ వర్గంలోని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, సీనియర్ మంత్రులు టీటీవీ దినకరన్ చేష్టలతో విసిగిపోయారని సమాచారం. అందుకే అందరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా కలిసి పని చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.

లీకులిచ్చిన అన్నాడీఎంకే నేతలు

లీకులిచ్చిన అన్నాడీఎంకే నేతలు

ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు ఒక్కటి కావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆదివారం తన సన్నిహితులకు చెప్పిన విషయం బయటపడింది. అదే జరిగితే ఇక దినకరన్ ఆటలు సాగవని సమాచారం.

కంట్రోల్ లో పెట్టుకుంటున్న నేతలు

కంట్రోల్ లో పెట్టుకుంటున్న నేతలు

శశికళ వర్గంలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలను తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఎడప్పాడి పళనిసామి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం సహాయం తీసుకోవడానికి ఎడప్పాడి పళనిసామి సిద్దం అయ్యారని సమాచారం. ఇదే జరిగితే ఇక శశికళ ఫ్యామిలీకి సినిమా కష్టాలు మళ్లీ మొదలుకానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+