వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకపై ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు - రెగ్యులేషన్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పలు సహకార బ్యాంకుల్లో మోసాలు, అక్రమాలు చోటుచేసుకోవడం, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు 2020ను రూపొందించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

 తిరుపతి ఎంపీ మృతి:మోదీ దిగ్భ్రాంతి -ఎవరూ సురక్షితంగా లేరన్న ఉత్తమ్ -బాధాకరమన్న చంద్రబాబు తిరుపతి ఎంపీ మృతి:మోదీ దిగ్భ్రాంతి -ఎవరూ సురక్షితంగా లేరన్న ఉత్తమ్ -బాధాకరమన్న చంద్రబాబు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949‌ను సవరించే ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార బ్యాంకుల్లో చోటుచేసుకునే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా డిపాజిటర్లను ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదని, డిపాజిటర్లను రక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు.

South Actress Sanjjanaa Galrani remanded into judicial custody

మొత్తం 277 పట్టణ సహకార బ్యాంకుల ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నదని, మరో 105 సహకార బ్యాంకులు కనీస నియంత్రణ మూలధన అవసరాన్ని తీర్చలేకపోతున్నాయని, 47 బ్యాంకుల నికర విలువ ప్రతికూలంగా ఉందని, 328 పట్టణ సహకార బ్యాంకులు 15 శాతం కంటే ఎక్కువ స్థూల ఎన్‌పీఏ నిష్పత్తిని కలిగి ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. సహకార బ్యాంకుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న అధికారాలను విస్తరించడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశమని నిర్మల స్పష్టం చేశారు.

ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్

బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు చట్టంగా మారిన తర్వాత.. ఆయా రాష్ట్రాల చట్టం ప్రకారం ఏర్పాటైన కో-ఆపరేటివ్ సొసైటీలు, స్టేట్ రిజిస్ట్రార్ అధికారాలను ప్రభావితం చేయబోదని, వ్యవసాయ కార్యకలాపాలకు దీర్ఘకాలిక రుణాలు అందించే ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలకు లేదా సహకార సంఘాలకు ఈ సవరణ బిల్లు వర్తించదని ఆర్థిక మంత్రి క్లారిటీ ఇచ్చారు.

English summary
Lok Sabha passes Banking Regulation (Amendment) Bill, 2020. Finance Minister Nirmala Sitharaman said amendments to the banking regulation law seeking to extend the supervision of RBI to cooperative banks are aimed at improving their governance and protecting depositors' money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X