వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెలరేగిన ఘర్షణలు: ఎస్పీతోపాటు 24మంది మృతి

|
Google Oneindia TeluguNews

మధుర: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధుర జవహర్‌బాగ్ సమీపంలోని ఓ పార్కు వద్ద చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు ఎస్పీ స్థాయి అధికారి కాగా, మరొకరు ఎస్సై కావటం గమనార్హం.

మధురలోని జవహర్‌బాగ్‌ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసురుతూ ఆందోళనకు దిగారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆక్రమణదారులు వద్ద కూడా ఆయుధాలు ఉండటంతో వారు కూడా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో లాఠీ ఛార్జి ఆపేసి భాష్పవాయు గోళాలు ప్రయోగించామని, చివరకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.

 SP among 21 killed in Mathura clash

ఆక్రమణదారుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. వారిలో ఒకరు నగర ఎస్పీ ముకుల్ ద్వివేది, పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్ సంతోష్ యాదవ్ ఉన్నారు. ఘర్షణల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం, కాల్పుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, మధురలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలానికి డీజీపీ జావేద్ అహ్మద్, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దేబాషిస్ పాండ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

రాజ్‌నాథ్‌ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

English summary
Twenty-One people, including an SP and an SHO, have been killed in the massive clash between police and encroachers that broke out in Mathura on Thursday even as Uttar Pradesh Chief Minister Akhilesh Yadav has ordered an inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X