వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరి నిర్ణయం ఈ ఇద్దరికి శాపమా వరమా..?

|
Google Oneindia TeluguNews

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అప్పుడే పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశరాజకీయాలను శాసించే రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పటి శతృవులు అఖిలేష్, మాయావతిల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు దేనికి సంకేతం.. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ యేతర ప్రభుత్వాలు రావాలని అఖిలేష్ మాయావతిలు కోరుకుంటున్నారు.అలా చూస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రయత్నాలు ప్రారంభించారు.. ఈ క్రమంలో ఎస్పీ బీఎస్పీ కలయిక ఇద్దరి చంద్రులకు శాపమా వరమా..?

దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!

 దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

దేశంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఇప్పటికే పొత్తులతో పలు పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఒక్కటయ్యాయి. దీంతో కొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. అఖిలేష్ మాయావతిలు ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారికంగా పొత్తులు ప్రకటించారు. అంతేకాదు తాము కాంగ్రెస్‌తో కలిసేది లేదని స్పష్టంగా చెప్పారు. బలమైన బీజేపీని ఎదుర్కొనేందుకు మొన్నటి వరకు శతృవులా ఉన్న పార్టీలు నేడు కలవక తప్పలేదని చెప్పారు. సీట్ల పంపకాలపై కూడా ఎలాంటి చర్చకు తావు లేకుండా చెరోసగం సీట్లలో కంటెస్ట్ చేస్తామని చెప్పారు.

 ప్రధాని రేసులో మాయావతి..?

ప్రధాని రేసులో మాయావతి..?

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చెబుతూనే ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు స్థానాల నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఒకటి అమేథీ, మరొకటి రాయ్‌బరేలీ. ఎస్పీ బీఎస్పీలు కాంగ్రెస్‌కు అక్కడ భిక్ష వేశాయా అనే చర్చ రాజకీయపార్టీలో సాగుతోంది. ఈ రెండు స్థానాల్లో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీలు రెండు పార్టీలతో ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించిన ఎస్పీ అధినేత బీఎస్పీ అధినేత్రిలు... కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే భావనలో ఉన్నారు. అలా జరిగితే ప్రధాని రేసులో మాయావతి ముందుంటారని అఖిలేష్ యాదవ్ చెప్పకనే చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌ ఇప్పటి వరకు ఎంతో మంది ప్రధాన మంత్రులను దేశానికి అందించిందని అదే ట్రెండ్ 2019లో కూడా ఫాలో అవుతుందని వెల్లడించారు.

చంద్రబాబు టీమ్‌లో మాయావతి అఖిలేష్‌లు ఉంటారా..?

చంద్రబాబు టీమ్‌లో మాయావతి అఖిలేష్‌లు ఉంటారా..?

ఇక బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పలువురు బీజేపీయేతర నేతలను దేశరాజధాని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ, శరద్ పవార్, శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లాంటి నాయకులతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి అఖిలేష్ యాదవ్, మాయావతిలు గైర్హాజరయ్యారు. ఆనాడే పొత్తులపై అఖిలేష్ మాయావతిలు ఒక అవగాహనకు వచ్చినట్లు అర్థమవుతోంది. ఇక తాజా పరిస్థితులు చూస్తే చంద్రబాబు టీమ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు కలవరని అర్థమవుతోంది.

 మాయావతి ప్రధాని కావాలన్న కోరికతో కేసీఆర్‌కు దూరం..?

మాయావతి ప్రధాని కావాలన్న కోరికతో కేసీఆర్‌కు దూరం..?

మరోవైపు మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనదైన శైలిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మమతా బెనర్జీని, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలన్నది కేసీఆర్ కాన్సెప్ట్. అయితే అఖిలేష్ మాయావతిల స్ట్రాటజీ కూడా ఇదే అయినప్పటికీ... మాయావతి ప్రధాని కావాలన్న బలమైన కోరిక కేసీఆర్ వెంట నడవనివ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజకీయాలను యూపీ డిసైడ్ చేయగల సత్తా ఉన్న నేపథ్యంలో చివరి వరకు వేచిచూసే ధోరణి అవలంబిస్తారని తెలుస్తోంది. ఇక నవీన్ పట్నాయక్ కూడా తాను నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వాలను కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ తాను చంద్రబాబుతో కానీ కేసీఆర్‌ను కానీ సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పలేదు.

మమత కోల్‌కతా ర్యాలీ ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతారు..?

మమత కోల్‌కతా ర్యాలీ ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతారు..?

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో తాము కట్టబోయే కూటమిలో కాంగ్రెస్ ఉండకూడదని కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే
తాను కూడా దేశ ప్రధాని రేసులో ఉన్నట్లు మాత్రం చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో కోల్‌కతాలో జనవరి 19న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆహ్వానం పలికారు మమత. ఈ ర్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అవుతారని తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీ హాజరైతే కేసీఆర్ ఈ ర్యాలీకి వెళ్లే పరిస్థితి లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మమత బెనర్జీ కాంగ్రెస్ లేకుండా ఎస్పీ బీఎస్పీలు ఒక్కటి కావడాన్ని అభినందించారు.

మొత్తానికి బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు కీలక ప్లేయర్ ఎవరవుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

English summary
With the new alliance i.e SP and BSP on cards, Indian politics have taken a interesting row. SP and BSP are hoping for a non BJP non congress governments at the centre. In this backdrop Telangana Chief Minister KCR is working out all the possibilities for a federal government. Now hot debate is on whether SP BSP alliance will support KCR or not. Since Mayawati is also in the front race for PM post one has to wait and see as how things go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X