• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎస్పీ బాలు లేరు.. ఆయన పాట మాత్రం శాశ్వతం - లెజెండరీ మృతితో శోకసంద్రంలా దేశం..

|

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మనకు దూరమయ్యారు. అనారోగ్యం మళ్లీ తిరగబెట్టడంతో శుక్రవారం ఆయన కన్నుమూశారు. కొవిడ్ మహమ్మారి బారి నుంచి కోలుకున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కండిషన్ క్రిటికల్ కావడంతో ఇవాళ మధ్యాహ్నం 1.04గంటలకు చనిపోయారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, బాలు కుటుంబీకులు తెలిపారు.

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గురువారం రాత్రి ప్రకట చేసిన తర్వాత వాాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నదని ఎంజీఎం గర్గాలు తెలిపినా, చివరికి విషాద వార్తనేే వినాల్సి వచ్చింది.

SP Balasubrahmanyam’s Health In Critical Condition: several celebs tweets

గురువారం సాయంత్రం నాటికి బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఈ క్లిష్ట సమయంలో ఆయన కోసం అభిమానులు ప్రార్థించాలని పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. గాయకుడి ఆరోగ్య పరిస్థితిపై తాజా వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ ప్రర్థనలు ఫలించలేదు. కరోనాతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు రెండో వారానికి ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఆయకు చికిత్స అందిస్తున్నారు. కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ ఇతర సమస్యల వల్ల బాలు పూర్తిగా కోలుకోలేకపోయారు. చివరికి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

శత్రువు పొంచినవేళ భారత రక్షణ వ్యవస్థలో భారీ లోపాలు: ఎయిర్ ఫోర్స్, నేవీపై కాగ్ సంచలన రిపోర్టులు

గాయకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పై మంగళవారం నాటి ప్రకటనలో ఆయన తనయుడు చరణ్ తెలిపారు. ఫిజియోథెరపీ సాగుతోందని, సొంతగా ఆహారం తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఆత్రుతగా బాలు ఎదురు చూస్తున్నారని చరణ్ తెలిపారు. అయితే, గురువారం నాటికి మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది.

బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సాంబమూర్తి, శంకుతలమ్మ. ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్న ఆ కుటుంబంలో బాలు రెండో కుమారుడిగా జన్మించారు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా ప్రముఖ గాయని అన్న సంగతి తెలిసిందే. బాలుకు భార్య సావిత్రి, కొడుకు చరణ్, కూతురు పల్లవి ఉన్నారు.

English summary
Legendary singer SP Balasubrahmanyam is recovering from COVID-19 at a private hospital in Chennai. For the past 50 days, he has been on life support. All of a sudden, his health condition became serious and a team of doctors is currently operating on him. The hospital officials are going to release a health bulletin shortly. As soon as the news broke out on social media, the fans started worrying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X