బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SP Balu: గిన్నీస్ బుక్ చాల చిన్నది, రికార్డులు చెప్పాలంటే, నటనలో హీరోలకే సినిమా చూపించిన సింగర్ !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ చెన్నై/ బెంగళూరు: టాలీవుడ్ లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని, సినీ అభిమానులను తీవ్రవిషాదంలో ముంచేస్తున్నాయి. గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu) ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త తెలిసిన వెంటనే సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం భారతదేశం గర్వించదగ్గ గాయకుడే కాదు, 75 సినిమాల్లో వివిద పాత్రల్లో నటించి హీరోలకే సవాలు విసిరి సినిమా చూపించిన మంచి నటుడు అనే విషయం ఆయన గురించి పూర్తిగా తెలిసిన చాలా తక్కువ మందికే తెలుసు. తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో 75 సినిమాలకు పైగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించారు. గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి రాయడానికి గిన్నీస్ బుక్ కూడా చిన్నదే అంటే అతిసయోక్తి కాదు.

SPB:ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త తెలిసింది మొదట కొడుకు కాదు, చరణ్ కు చెప్పింది వాళ్లే, నిమిషాల్లో!SPB:ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త తెలిసింది మొదట కొడుకు కాదు, చరణ్ కు చెప్పింది వాళ్లే, నిమిషాల్లో!

బాలు అంటే బాలు అంతే

బాలు అంటే బాలు అంతే

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం సినీ ప్రపంచానికి ఎస్పీ బాలసుబ్రమణ్యంగా పరిచయం అయ్యారు. భారతదేశంలోని 17 బాషల్లో 41 వేల 230కిపైగ పాటలు పాడి ఆయన గానంతో అందర్నీ కట్టిపడేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఎవ్వరూ పోటీ రారు, ఆయనకు ఎవ్వరు పోటీ లేరు అనే అంతగా ఎదిగారు. బాలు అంటే బాలు అంతే అని అందిరితో శభాష్ అనిపించుకున్నారు.

ఎంత గొప్ప గాయకుడో అంతే గొప్ప నటుడు

ఎంత గొప్ప గాయకుడో అంతే గొప్ప నటుడు


ఎస్పీ బాలసుబ్రమణ్యం భారతదేశం గర్వించదగిన గాయకుడే కాదు, డబ్బింగ్ ఆర్టిస్టు, సంగీత దర్శకుడు, నిర్మతగా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గాయకుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో నటుడిగా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ తదితర బాషల్లో ఇప్పటి వరకు ఎస్పీ బాలసుబ్రమణ్యం 75 సినిమాలకు పైగా నటించారు. ఇక పాడుతా తియ్యగాతో పాటు అనేక టీవీ షోలు నిర్వహించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.

బాలయ్య ఆదిత్య 369 సినిమా కింగ్ పిన్ బాలు

బాలయ్య ఆదిత్య 369 సినిమా కింగ్ పిన్ బాలు

ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పకుడిగా వ్యవహరించారు. ఆదిత్య 369 సినిమా తెరకెక్కించడానికి మూలకారణం ఎస్పీ బాలసుబ్రమణ్యం అని ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావ్ అనేక సందర్బాల్లో చెప్పారు. ఎస్పీ బాలసుబ్రమణం లేకుంటే ఆదిత్య 369 సినిమా తెరమీదకు వచ్చేది కాదని స్వయంగా ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావ్ అనేక ఇంటర్వూల్లో స్పష్టం చేశారు.

 తమిళ హీరోలకే సవాల్

తమిళ హీరోలకే సవాల్

తెలుగు, తమిళ, కన్నడ, మళయాల బాషల్లో గాయకుడిగా బిజీ అయిపోతున్న సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం నటుడిగా అవతారం ఎత్తారు. 1971లో తమిళ చిత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తమిళ హీరోలకే నటనలో సవాలు విసిరారు. 1987లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో రాధికతో కలిసి ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించి అందరితో ఔరా అనిపించుకున్నారు.

మనసు పెట్టిన బాలు

మనసు పెట్టిన బాలు

తమిళంలో తెరకెక్కిన కిలాడి కన్మయి సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం తన నటనతో ఇప్పటికీ తమిళ సినీ ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కిలాడి కన్మయి సినిమాలో రాధికతో పోటీపడి మరీ నటించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తాను నటనలో కూడా ఏమాత్రం తీసిపోను అని నిరూపించుకున్నారు. వసంత్ దర్శకత్వం వహించిన కిలాడి కన్మయి సినిమా అప్పట్లో తమిళనాడును ఓ ఊపుఊపేసింది.

పాట పాడకుండా బాలు నటించిన ఒకే ఒక్క సినిమా

పాట పాడకుండా బాలు నటించిన ఒకే ఒక్క సినిమా

బాలు పాట పాడితే మా సినిమా సూపర్ హిట్ అని అందరూ హీరోలు అనుకోవడం సర్వసాధారణం. అయితే అలాంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక్కపాట కూడా పాడకుండా నటించిన ఒకే ఒక సినిమా ఉంది. జాతీయస్థాయి నటుడు కమల్ హాసన్ హీరోగా సంతానభారతి దర్శకత్వంలో తమిళంలో గుణ (తెలుగులో గుణ) సినిమా తెరకెక్కించారు. గుణ సినిమాలో రామయ్య అనే పోలీసు అధికారి పాత్రలో బాలు నటించారు. అయితే తమిళ గుణ సినిమాలో బాలసుబ్రమణ్యం ఒక్కపాట కూడా పాడలేదు. అయితే తెలుగులో డబ్బింగ్ చేసి అదే సినిమాను గుణ పేరుతో విడుదల చేశారు. తెలుగు గుణ సినిమాలో బాలు మూడు పాటలు పాడారు. పాటపాడకుండా ఓ గాయకుడు నటించిన గుణ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

శంకర్ మార్క్ తో బాలు, ప్రభుదేవా, గిరీష్ కర్నాడ్

శంకర్ మార్క్ తో బాలు, ప్రభుదేవా, గిరీష్ కర్నాడ్


భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒక్కరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కాదలన్ (తెలుగులో ప్రేమికుడు) సినిమాలో బాలసుబ్రమణ్యం నటవిశ్వరూపం చూపించారు. ప్రభుదేవ తండ్రిగా, మధ్యతరగతి వ్యక్తిగా నటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రేమికుడు సినిమాలో గిరీష్ కర్నాడ్, రఘువరన్, ప్రభుదేవా, వడివేలు తదితరులతో పోటీ పడి నటించారు బాలు. అదే సినిమాలో ఉదిత్ నారాయణ్ తో కలిసి ఉత్సాహంగా పాటలు పాడారు. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమాలో (తెలుగులో మెరుపుకలలు) ఎస్పీ బాలసుబ్రమణ్యం బహుబాష నటులు అరవిందస్వామి, గిరీష్ కర్నాడ్, ప్రభుదేవా, నాజర్, బాలీవుడ్ హీరోయిన్ కాజల్ తదితరులతో పోటీపడి నటించారు. మొత్తం మీద ఇలా చెప్పకుంటూ పోతే ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి రాయడానికి గిన్నీస్ బుక్ కూడా సరిపోదు అంటే అతిసయోక్తికాదు అంటున్నారు ఆయన అభిమానులు.

English summary
SP Balasubrahmanyam: Veteran Playback singer SP Balasubrahmanyam passed away. Not only a great singer he also acting in lot of movies with good characters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X