కళా ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్న మోడీ, అద్భుత స్వరాన్ని కోల్పోయామన్న రాష్ట్రపతి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణంపై సంతాపం వ్యక్తం చేశారు . ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు . ప్రధాని నరేంద్ర మోడీ బాలసుబ్రమణ్యం మృతిపై స్పందిస్తూ కళా ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది అన్నారు .బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం పై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు ప్రతి ఇంట్లో మార్మోగిన ఆయన గళం దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించినదని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు తన సానుభూతిని ప్రకటించారు.
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమం కోసం .. వైసీపీ ఎమ్మెల్యే భూమన పూజలు
భారతీయ సంగీతం ఓ అద్భుత స్వరాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు . యావద్దేశ సంగీత ప్రియులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం తీరని లోటని రాష్ట్రపతి ట్విట్టర్లో తన సంతాప ప్రకటన తెలియజేశారు. బాలచంద్రుడి గా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్ తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారని రాం నాథ్ కోవింద్ కొనియాడారు . బాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు మిత్రులకు భారత రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
.

ప్రముఖ నేపథ్య గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన పాడిన పాటలు సమకూర్చిన బాణీలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి అంటూ ఆయన పేర్కొన్నారు.ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఎస్పీ బాలు మృతిపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .