ముగిసిన ఎస్పీ బాలు అంత్య క్రియలు .. గాన గంధర్వుడికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలు
తమిళనాడులోని తామరైప్పాకం లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు . కడసారి ఆయనను చూడడం కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు . ఆయనకు అశ్రు నీరాజనాలు అర్పించారు . కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించారు . శోక సంద్రంలో తామరైప్పాక్కం ప్రాంతం అంతా మునిగిపోయింది. ఐదున్నర దశాబ్దాల పాటు ఆయన చేసిన సంగీత సేవ ఎనలేనిది . ఆయన గానామృతం అంతే మధురమైనది అంటూ అక్కడికి వచ్చిన అశేష జన వాహిని ఆయనను స్మరించుకున్నారు .
తెలుగు భాషకు పట్టం కట్టిన ఎస్పీ బాలు ... స్వరాభిషేకం చేసి మరీ వర్ధమాన గాయకులకు మార్గదర్శిగా..

చివరి సారి చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు
తమిళనాడులోని తామరైప్పాకం లోని ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు . కడసారి ఆయనను చూడడం కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు . ఆయనకు అశ్రు నీరాజనాలు అర్పించారు . కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించారు . శోక సంద్రంలో తామరైప్పాక్కం ప్రాంతం అంతా మునిగిపోయింది. ఐదున్నర దశాబ్దాల పాటు ఆయన చేసిన సంగీత సేవ ఎనలేనిది . ఆయన గానామృతం అంతే మధురమైనది అంటూ అక్కడికి వచ్చిన అశేష జన వాహిని ఆయనను స్మరించుకున్నారు .

తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో అశ్రు తర్పణాల మధ్య ముగిసిన అంత్య క్రియలు
తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో అశ్రు తర్పణాల మధ్య, భారమైన హృదయంతో ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు . అంతకు ముందు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం, వేద మంత్రోచ్చారణల నడుమ అంతిమ క్రతువు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు, తమిళ, మళయాళ చిత్ర పరిశ్ర్రమ వర్గాలు ఆయనకు కడసారి నివాళులు అర్పించాయి.

తమిళనాడు ప్రభుత్వ లాంచనాలతో వీడ్కోలు
తామరపాక్కంలో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు అశేషంగా తరలి వస్తున్న జనసంద్రాన్ని కంట్రోల్ చెయ్యటం అక్కడ పోలీసులకు సవాల్ అయింది . ఆయనపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ విషాద వదనాలతో ఆయనను చివరిసారి చూసేందుకు వచ్చారు . తామరైప్పాకం వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో , శాస్త్రోక్తంగా ఆయన అంత్య క్రియలను నిర్వహించారు .
హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయనకు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అంత్య క్రియలు నిర్వహించారు . తమిళనాడు పోలీసులు గౌరవ వందనం నిర్వహించారు. ఎస్పీ బాలు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు . వైదిక శైవ సంప్రదాయం ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు .

స్వర్గ పురికి చేరిన ఎస్పీ బాలు
స్వర సామ్రాట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త ముఖ్యాంశాలుగా నిలిచినందున ఇది సంగీత ప్రియులకు అత్యంత విషాదకరమైన రోజు . ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో విశేషంగా పని చేసిన దిగ్గజ గాయకుడు, పెద్ద తెరపై పలువురు హీరోలకు స్వరం వినిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సెప్టెంబర్ 25 న ఈ లోకాన్ని వీడి వెళ్ళారు . నేడు ఆయన అంత్య క్రియలు పూర్తి కావటంతో ఆయన భౌతికంగా అంతర్ధానం అయ్యారు. స్వర్గ పురికి చేరిపోయారు.