• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా పేరు ముందు అవి వాడకండి - ఎస్పీ బాలు రాసిన లేఖ వైరల్- గాన చంద్రుడన్న సోనియా గాంధీ

|

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం చెన్నైలో ముగిశాయి. తిరిగిరాని లోకాలకు వెళ్లిన గాయకుణ్ని తలుచుకుంటూ అభిమానులందరూ ఆయన తలంపులతోనే కాలంగడుపుతున్నారు. బాలు కన్నుమూసిన తర్వాత... ఆయన గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు సెలబ్రిటీలు బాలు మరణంపై సంతాపాలు తెలిపారు.

ఆ లేఖలో ఇలా..

ఆ లేఖలో ఇలా..

అందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. నవంబర్‌ 30న మీ కార్యక్రమానికి తప్పక రాగలను.. కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరారు.. అందులో ముఖ్యంగా.. నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్‌, గానగంధర్వ వంటి విశేషణలు వేయకండి.. మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రయాణ వివరాలను తర్వాత చెప్పగలను.. అంటూ లేఖను ముగించారు. బాలు ఎప్పుడో రాసిన ఓ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

కేంద్ర కేబినెట్ విస్తరణ - మంత్రుల శాఖల్లో మార్పులు - తెలుగు నేతలకు పదవులు?

గానచంద్రుడు బాలు..

గానచంద్రుడు బాలు..

శ్రావ్యమైన స్వరంతో భావోద్వేగ శక్తితో పలు భారతీయ భాషల్లో పాటలు పాడి, దేశ సంగీత, సాస్కృతిక రంగంలో ధృవతారగా వెలుగొందారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లెజెండరీ సింగర్ కు నివాళులు అర్పించారు. కళారంగంలో బాలు లేని లోటు పూడ్చలేనిదని, ‘గాన చంద్రుడి'గా ఆయన తన ప్రకాశాన్ని వెదజల్లుతూనే ఉంటారని సోనియా కీర్తించారు. 74 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం కరోనా కు చికిత్సి పొందుతూ, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడు

  #HappyBirthdayPMModi : PM Modi కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు!
  ఎస్పీబీని గుర్తుంచుకోవాలంటే..

  ఎస్పీబీని గుర్తుంచుకోవాలంటే..

  నటుడు మాధవన్ బాలుకు సంబంధించిన వీడియో ఒకదానిని శనివారం అభిమానులకు షేర్ చేశారు. అందులో బాలు.. ‘‘నేను చనిపోవాలని అనుకోవడం లేదు'' అని చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ.. ‘‘ఈ లెజెండ్‌ని గుర్తుంచుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు.. ఆయనని గుర్తుంచుకున్నట్లే‘‘ అని మాధవన్ రాసుకొచ్చారు.

  English summary
  Congress president Sonia Gandhi condoled the death of celebrated playback singer SP Balasubrahmanyam and hailed him as the "singing moon" who shed his radiance over the country. One of the handwritten letter of SP Balasubramaniam is going viral on social media. In it, he gives an explanation for a program .. I ask you to forgive some small requests .. Do not put adjectives like 'Doctor', 'Padmabhushan', 'Gana Gandharva' in front of my name, Currently this letter is going viral on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X