వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్‌లో కొట్టుకున్న నేతలు, బీజేపీ నేతపై ఎస్పీ నేత దాష్టీకం: వీడియో పోస్ట్ చేసిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

నోయిడా: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అయినప్పటికీ ఆ నేతలు పట్టించుకోలేదు. బాహాబాహీకి దిగారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సదరు ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత గౌరవ్‌ భాటియా, సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్‌ భడోరియా పాల్గొన్నారు. ఓ అంశంపై చర్చిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవ పెద్దగా మారింది. చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఎస్పీ నేత రెచ్చిపోయి బీజేపీ నేతపై చేయి చేసుకోవడం కలకలం రేపింది.

SP, BJP leaders come to blows on live TV debate

బీజేపీ నేతపై సమాజ్‌వాది నేత భౌతిక దాడికి దిగారు. ఈ ఘటన అనంతరం బీజేపీ నేత ఫిర్యాదు మేరకు ఎస్పీ నేత అనురాగ్‌ భడోరియాను పోలీసులు నిర్బంధించారు. అనురాగ్ భడోరియాను నిర్బంధంలోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సురేంద్ర సింగ్‌ నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. భడోరియాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భడోరియా తనపై చేయి చేసుకున్నాడని, తిట్టాడని భాటియా ఫిర్యాదు చేశారు. అంతేకాక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైతం పోలీసులకు నివేదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

English summary
Samajwadi Party spokesperson Anurag Bhadoria and his BJP counterpart Gaurav Bhatia scuffled with each other during a live debate Saturday, with the police later taking the SP leader in custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X