వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులను దోచారు, దళితులను వేధించారు : ఎస్పీ, బీఎస్పీపై మోదీ విసుర్లు

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్‌పై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తే .. కేంద్రంలో అధికారం సులభమనే ఆలోచనతో ప్రధాని మోదీ, రాహుల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. యూపీలోని ఇటావాలో శనివారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు.

sp, bsp are cheating farmers and dalits : modi

వారిది నకిలీ పొత్తు
ఎస్పీ, బీఎస్పీ రెండు భావసారుప్య పార్టీలు. వైరివర్గాలు కేవలం అధికారం దాహం కోసం ఒక్కటై పోటీ చేస్తున్నాయని మోదీ విమర్శించారు వారి నకిలీ పొత్తు రాజకీయం మే 23తో ముగుస్తోందని విశ్లేషించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించడంతో పాటు, విపక్షాలపై విమర్శలు చేశారు. వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.

రైతులను వంచించారు
'ఎస్పీ, బీఎస్పీ జెండాలు వేరు .. కానీ ఆలోచనలు మాత్రం ఒక్కటేనని విమర్శించారు మోదీ. ఎస్పీ, బీఎస్పీ ఇద్దరు రైతులను దోచుకోవడమే గాక ..దళితులను వేధించారని గుర్తుచేశారు. పేదల గురించి ఎస్పీ ఏమాత్రం ఆలోచించదని, వారి బంగ్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడం గురించే ఆ పార్టీ నేతలు పనిచేస్తారని మండిపడ్డారు. ఎన్నికలు ముగియగానే ఎస్పీ-బీఎస్పీ పొత్తు కూడా ముగుస్తుంది. మే 23 తేదీ వారి పొత్తుకు చివరి రోజు అని అభివర్ణించారు. తర్వాత ఒకరికొకరు శత్రువులుగా మారిపోతారని జోస్యం చెప్పారు.

English summary
Modi's election campaign was held on Saturday in Uttar Pradesh. On this occasion, SP and bsp criticized by modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X