వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజాంఖాన్‌ క్షమాపణలు చెప్పాల్సిందే... స్పీకర్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

డిప్యూటి స్ఫికర్ రమాదేవిపై సమాజ్ వాది ఎంపీ అంజాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పికర్ ఓం బిర్లా ఆదేశించారు. దీనిపై రెండు రోజులుగా లోక్‌సభలో దుమారం రేగుతుండగా స్పీకర్ ఆల్‌పార్టీ సమావేశం ఏర్పాటు చేశాడు. అనంతరం పలువురి అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత స్పికర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.కాగా స్పికర్ నిర్ణయం తర్వాత సోమవారం జరిగే సమావేశాల్లో అజాంఖాన్ సభలో క్షమాపణాలు చేప్పే అవకాశాలు ఉన్నాయి.

ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా గురువారం లోక్‌స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవిపై ఎంపీ ఆజంఖాన్ అనుచిత‌ వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను లోక్‌స‌భ స‌భ్యులందరూ ఖండించారు. ఇవాళ మ‌హిళా ఎంపీలు, మంత్రులు మాట్లాడుతూ.. ఆజం ఖాన్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని మండిపడ్డారు . దీంతో స్పీక‌ర్ ఒంబిర్లా విప‌క్ష పార్టీల నేత‌ల‌తో చ‌ర్చించారు. దీంతో పలువురి ఎంపీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స‌భ‌లోనే ఆజంఖాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్ని పార్టీలు తీర్మానించిన‌ట్లు స్పీక‌ర్ తెలిపారు. ఒక‌వేళ ఆజం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ని ప‌క్షంలో ఆ త‌ర్వాత ఆయ‌న‌పై చ‌ర్య తీసుకుంటామ‌ని స్పీక‌ర్ బిర్లా చెప్పారు.

SP lawmaker Azam Khan asked to his unconditional apology in parliament: Speaker

సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటి స్పికర్‌ను చూస్తూ మీ కళ్లలోకి కళ్లు పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నానని అన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ ఓం బిర్లా ఆజం ఖాన్‌ను మందలించి క్షమాపణ చెప్పాలని సూచించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం ఆయనను సమర్థిస్తూ పార్లమెంటులో బీజేపీ సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని ఆరోపించారు. క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని, అన్ పార్లమెంటరీ పదాలు వాడితే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.

English summary
Samajwadi Party lawmaker Azam Khan asked to furnish his unconditional apology in parliament on Monday for sexist comments that were condemned by lawmakers across political lines today. "If he doesn't apologise, the Speaker has been authorized to take action against him," said Parliamentary Affairs Minister Pralhad Joshi after a meeting between the Speaker and leaders of all parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X