వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పుల కలకలం: ప్రధాన్, కుమారుడిపై ఫైర్, అక్కడికక్కడే మృతి..

|
Google Oneindia TeluguNews

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల విషయంలో మొదలైన గొడవ ఇద్దరు ప్రాణాలు తీసింది. రహదారి పనుల విషయంపై ప్రధాన్ (గ్రామ సర్పంచ్) మాజీ ప్రధాన్ మధ్య గొడవకు దారితీసింది. కోపోద్రిక్తుడైన మాజీ ప్రధాన్.. ప్రధాన్, అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే నెలకొరిగారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది.

సాంబాల్ జిల్లా సాన్ సోయి గ్రామానికి చెందిన ప్రధాన్ చోటె లాల్ దివాకర్.. ఇతను ఎస్పీ నేత కూడా. అయితే మాజీ ప్రధాన్‌తో ఇతనికి వ్యక్తిగతంగా వైరం కూడా ఉంది. దీంతో మంగళవారం దివాకర్, అతని కుమారుడిపై కాల్పులు జరిపారు. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్యలపై కేసు నమోదు చేశామని.. నిందితుల కోసం గాలించడానికి మూడు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. కొందరినీ అదుపులోకి కూడా తీసుకున్నామని కూడా తెలిపారు.

SP leader, son gunned down in Uttar Pradesh’s Sambhal

Recommended Video

Amphan Cyclone : Uppada Coast, Kakinada Port On High Alert

కాల్పులు జరిపే సమయంలో తీసిన వీడియోలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు కనిపిస్తోంది. కాల్పులు జరిపే సమయంలో కూడా రెండువర్గాల మధ్య వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని.. దళిత నేతను హత్య చేయడం దేనికి సంకేతమని ఎస్పీ ట్వీట్‌లో విమర్శించింది. మాజీ ప్రధాన్‌తో తమకు థ్రెట్ ఉంది అని, భద్రత కల్పించాలని కోరినా.. పోలీసులు స్పందించలేదని.. అందుకే హత్య జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

English summary
Samajwadi Party leader Chhote Lal Diwakar and his son were gunned down in Uttar Pradesh’s Sambhal on Tuesday over a tussle with a former pradhan in Sansoi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X