వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు, మమత అల్లుడిపై దాడి చేసిన వ్యక్తి పరిస్థితి విషమం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు షాక్! అధికార సమాజ్‌వాది పార్టీకి చెందిన చర్ఖారీ నియోజకవర్గం ఎమ్మెల్యే కఫ్తాన్ సింగ్ రాజ్‌పుత్‌కు స్థానిక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2002 ఏప్రిల్ 20న కిషన్ దుబే అనే వ్యక్తి పైన దాడి చేసి హత్య చేసిన కేసులో రాజ్ పుత్, అతని సోదరుడు, మరో తొమ్మిది మంది పైన కేసు నమోదయింది.

పదమూడేళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో వారిద్దరు దోషులని శుక్రవారం నిర్ధారించిన ప్రత్యేక కోర్టు నేడు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది.

శుక్రవారమే ఎమ్మెల్యే, అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేకు శిక్ష ఖరారు కావడంతో ఆయన శాసన సభ్యత్వానికి అనర్హుడు కానున్నారు.

SP MLA Kaptan Singh Rajput gets life imprisonment

మమత బెనర్జీ అల్లుడి పైన దాడి చేసిన వ్యక్తి పరిస్థితి విషమం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతనికి పలుచోట్ల గాయాలయ్యాయి. ఆయన కండిషన్ విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

కాగా, అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి 25 ఏళ్ల బీటెక్ విద్యార్థి. దుర్గాపుర్‌లోని ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నాడు. అతని పైన దాడి చేసిన సమయంలో ఆ విద్యార్థి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఖుదీరామ్స్ ఆత్మను. నేను మళ్లీ జన్మిస్తాను. గుడ్ బై, ఇండియన్స్' అని చెప్పాడు.

English summary
In a major embarrassment to Akhilesh Yadav government in Uttar Pradesh, a ruling Samajwadi Party MLA Kaptan Singh Rajput was on Monday sentenced life imprisonment in 2002 murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X