వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేశ్ యాదవ్‌కు షాక్.. బీజేపీ గూటికి తమ్ముడి భార్య అపర్ణా?

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజీపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ సై అంటే సై అన్నట్టుగా తలపడుతున్నాయి. కమలం పార్టీకి గుడై బై చెప్పిన‌ ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. బీజేపీ పని అయిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి తరుణంలో సమాజ్ వాదీకి పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అప‌ర్ణా యాద‌వ్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున‌ట్లు సమాచారం.

 క‌మ‌లం గూటికి అప‌ర్ణా యాద‌వ్‌?

క‌మ‌లం గూటికి అప‌ర్ణా యాద‌వ్‌?

యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు తన తమ్ముడి ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే అపర్ణతో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు ఇరువర్గాలు సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఓ కొలిక్కి రావాల్సి ఉందని చెబుతున్నారు.

 అఖిలేష్ యాద‌వ్‌కు బీజేపీ చెక్ ..

అఖిలేష్ యాద‌వ్‌కు బీజేపీ చెక్ ..


బీజేపీ నేతలకు ఆకర్షించేందుకు అఖిలేష్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు కమలనాథులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కాషాయ పార్టీకి ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. దీనికి విరుగుడుగా బీజేపీ కొత్త పంథాను అమలు చేస్తుంది. ఇప్పుడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యురాలినే కమలదళంలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం.

 లక్నో కంటోన్మెట్ టికెట్ ఇస్తే..

లక్నో కంటోన్మెట్ టికెట్ ఇస్తే..


ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడలు అప‌ర్ణా యాద‌వ్ 2017ఎల‌క్ష‌న్స్ లో కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. అప్పుడు బిజెపి అభ్య‌ర్థి రీతా బ‌హుగుణ చేతిలో 33,976 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లక్నో కంటోన్మెట్ టికెట్ ఇచ్చేట్టు అయితే బీజేపీలో చేరి.. పోటీ చేయాలని అపర్ణా యాదవ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. అఖిలేష్ యాదవ్‌కు స్వయాన తమ్ముడి భార్య అపర్ణ యాదవ్ కమలంతో చేతులు కలిపార‌న్న వార్త‌ల‌ను జీర్ణించుకోలేకపోతున్నారు.

 మోదీ నిర్ణ‌యాల‌కు అప‌ర్ణ మ‌ద్ద‌తు

మోదీ నిర్ణ‌యాల‌కు అప‌ర్ణ మ‌ద్ద‌తు


గతంలో అపర్ణయాదవ్ పలు సందర్భాల్లో ప్రధాని మోదీ నిర్ణయాలను బహిరంగంగానే సమర్థించారు. ఎన్ఆర్సీ, రామ మందిరం వంటి పలు అంశాలలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. రామ మందిర నిర్మాణానికి రూ. 11 లక్షలు విరాళం కూడా ఇచ్చారు. తన కుటుంబ సభ్యులు చేసిన త‌ప్పులుకు తాను బాధ్యురాలిని కాదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీని కాదని బీజేపీలో చేరేందుకు అపర్ణా సిద్ధమైంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో చాడాలి..

English summary
SP Mulayam Singh daughter in law Apartna Yadav likely to join BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X