వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంకు కరోనా.. మేదాంతలో చేరిక, స్థిమితంగానే..

|
Google Oneindia TeluguNews

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఎస్పీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కానీ ములాయంకు కరోనా లక్షణాలు కనిపించలేదు అని పేర్కొన్నాయి.

తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం స్ధిమితంగా ఉంది అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోందని.. సమయానుకూలంగా ఆరోగ్య పరిస్థతిని వివరిస్తున్నారని అఖిలేశ్ కూడా ట్వీట్ చేశారు.

 SP patriarch Mulayam Singh Yadav tests Covid positive

ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే మరోసారి పరీక్ష చేయించుకోగా.. నెగిటివ్ వచ్చింది. అయినా వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటానని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కరోనా వైరస్ బారినపడి.. కోలుకున్నారు. వారి బాటలో ములాయం చేరారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.

అమిత్ షా కూడా మేదాంత ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కానీ తర్వాత ఎయిమ్స్‌లో చేరారు. రెండు సార్లు ట్వీట్‌మెంట్ తీసుకొని.. కోలుకున్నారు. ఇప్పుడు ములాయం కూడా మేదాంత ఆస్పత్రిలో చేరారు. మేదాంత కార్పొరేట్ ఆస్పత్రి.. విమానాల్లో సైతం రోగులకు వైద్య సేవలు అందించగలదు. అందుకే అమిత్ షా చేరిన సమయంలో ట్రోల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ దవాఖానలో చేరారు.

English summary
Founder of the Samajwadi Party and former Uttar Pradesh Chief Minister Mulayam Singh Yadav tested positive for Covid-19 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X