వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఫ్యామిలీ రోజకీయం ఎన్నో మలుపులు తిరిగింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఫ్యామిలీ రోజకీయం ఎన్నో మలుపులు తిరిగింది.

ఆ సమయంలో బాగా వినిపించిన పేరు అపర్ణా యాదవ్. ములాయం రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య ఈమె. విద్యావంతురాలైన అపర్ణకు రాజకీయాల పట్ల అమితమైన ఆశక్తి. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, తెరవెనుక నుంచి ఆమె రాజకీయ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనేవారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు.

<strong>యూపీ ఎన్నికలు-2019 'లీడర్': మోడీ ప్రజాదరణ, షా లీడర్‌షిప్</strong>యూపీ ఎన్నికలు-2019 'లీడర్': మోడీ ప్రజాదరణ, షా లీడర్‌షిప్

SP’s Aparna Yadav has a bad start to UP election politics

ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేదాలు తలెత్తడానికి కూడా అపర్ణే కారణమని వాదనలు వినిపించాయి. జాతీయ మీడియాలో ఆమె పేరు మార్మోగింది. అపర్ణా యాదవ్ ప్రధాని మోడీ అభిమాని కూడా.

ఆమె ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆమె కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. లక్నో కంటోన్మెంట్ నియోజకర్గంలో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై పోటీ చేసిన ఆమె పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ కూడా అపర్ణ విజయం కోసం ప్రత్యేకంగా ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

రాయ్‌బరేలీ, అమేథిలలో గాంధీలకు షాక్

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాలైన రాయ్ బరేలి, అమేథిలలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలలో ఆరింట బీజేపీ గెలిచింది. అమేథిలో నాలుగు చోట్ల బీజేపీ గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలోనే గెలిచింది.

English summary
The main candidates from Lucknow Cantt are Yogesh Dixit (BSP), Dr. Reeta Joshi (BJP), Virendra Kumar Shukla (RLD), Aparna Yadav (SP), Kunwar Gaurav Upadhyay (SHS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X