వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు మీరే మాకు మేమే : ఒంటరిగానే పోటీచేస్తామని మాయకు అఖిలేశ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

లక్నో : యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి ఆశించిన సీట్లు సాధించకపోవడంతో .. ఓటమిపై ఆ పార్టీ అధినేతలు అసహనం బయటపడుతోంది. నిన్న అఖిలేశ్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బీఎస్పీ చీఫ్ మాయావతి. అతని వల్లే ఓటమి చెందామని .. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామనే సంకేతాలు ఇచ్చారు. బెహన్ జీ వ్యాఖ్యలపై అఖిలేశ్ రియాక్ట్ అయ్యారు. మాయా అభీష్టం అలా ఉంటే .. మేం కూడా ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు.

వీడిన కూటమి ..
యూపీలో మహాకూటమి విఛ్చిన్నమైందన్నారు అఖిలేశ్ యాదవ్. ఓటమికి తననే బాధ్యుడిని చేశాడని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో కూటమి లేకుంటే .. మాయతో తమతో కలిసి రాకుంటే, ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. 11 చోట్ల జరిగే ఉప ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిగా పోటీచేస్తుందని .. ఎవరితో కలిసి బరిలోకి దిగే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

SP will also contest UP bypolls alone : Akhilesh

యూపీలో యాదవుల ఓట్లను ఎస్పీ చీల్చలేదని .. అందుకే కూటమి ఓటమి చవిచూసిందని మాయావతి విమర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న యాదవులు ఎస్పీ వైపు కాక బీజేపీ వైపు మళ్లారని ఆరోపించారు. ఒకవేళ వీరంతా తమ కూటమి వైపు మళ్లితే తమ సీట్ల సంఖ్య తారుమారయ్యేదని పేర్కొన్నారు. అంతేకాదు కనౌజ్‌లో అఖిలేశ్ భార్య డింపుల్ ఓడిపోవడం ఇందుకు ఉదహరణ అని మాయావతి పేర్కొన్నారు. ఆ తర్వాత తాము ఎస్పీతో కొనసాగబోమని మాయవతి స్పష్టంచేయడంతో .. ఈ మేరకు ఇవాళ అఖిలేశ్ స్పందించారు.

మళ్లీ కలిసే పోటీచేస్తాం ?
అయితే ఉప ఎన్నికల్లో మాత్ర ఒంటరిగానే పోటీచేస్తామని మాయావతి సంకేతాలిచ్చారు. దీనికి అఖిలేశ్ కూడా మేం కూడా ఒంటరిగా పోటీచేస్తామని తెలిపారు. అయితే భవిష్యత్తులో మాత్రం మళ్లీ కలిసి పోటీచేస్తామని మాయావతి సంకేతాలు ఇచ్చారు.

ఇది తాత్కాలిక బ్రేక్ అని చెప్పారు. మళ్లీ కలిసి పనిచేస్తామని ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే దీనిని అఖిలేశ్ మాత్రం ధ్రువీకరించలేదు. ఉప ఎన్నికలతో పాటు .. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒంటరిగానే పోటీచేయాలనే యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
after being snubbed by Mayawati, Samajwadi Party chief Akhilesh Yadav has said his party will start preparing for the upcoming by-elections. When asked about Mayawati's statement, Akhilesh told the media, "If the coalition has broken, I will reflect deeply on it. If the coalition isn't there in the by-elections then Samajwadi Party will prepare for the elections. SP will also fight on all 11 seats alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X