ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ : పార్టీకి పిలిచి యువతిపై అత్యాచారం..
గురుగ్రామ్ : సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. దానివల్ల ఎంత లాభముందో అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ఓ యువతి జీవితం నాశమైంది. సోషల్ మీడియాలో సదరు మహిళతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి అద్దెకు ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో ప్రస్తుతం ఆ కామాంధుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.
కన్నతండ్రే కాలయముడు.. పెళ్లి చేసుకోను అన్నందుకు..
ఫేస్బుక్లో పరిచయం
ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన స్పానిష్ యువతి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు భారత్‌కు వచ్చింది. గురుగ్రామ్‌లో ఉన్న ఆమె అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫేస్బుక్లో రెంట్‌కు ఇల్లు కావాలంటూ పోస్ట్ చేసింది. యానిమేషన్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న ఢిల్లీ ఆనంద్ విహార్‌కు చెందిన ఆంజనేయ్ అనే వ్యక్తి ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉంటున్నాడు. స్పానిష్ యువతి ఎఫ్బీలో పెట్టిన పోస్టు చూసి అద్దెకు ఇల్లు ఇప్పిస్తానంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త స్నేహంగా మారింది.
ఇంటికి పిలిచి అత్యాచారం
శుక్రవారం పార్టీ ఉందంటూ ఆంజనేయ్ స్పానిష్ యువతిని ఇంటికి పిలిచాడు. దీంతో ఆమె రాత్రి 10.30 సమయంలో అతని ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికి అంజనేయ్ ఆమెను తనతో శృంగారంలో పాల్గొనాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో పొద్దు పోయినందున రాత్రికి అక్కడే ఉండాలని కోరాడు. దీంతో అతనిపై నమ్మకం ఉంచి అదే ఫ్లాట్‌లో ఉండిపోయింది. అయితే అర్థరాత్రి సమయంలో అలికిడి కావడంతో నిద్రమేల్కొన్న యువతికి నగ్నంగా ఉన్న అంజనేయ్ కనిపించాడు. అది చూసి భయపడిన ఆమె తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధంకాగా.. అడ్డుకున్న నిందితుడు యువతిపై అత్యాచారం చేశాడు.
స్నేహితురాలి సాయంతో ఫిర్యాదు
ఘటన జరిగిన మరుసటి రోజు స్నేహితురాలి సాయంతో స్పానిష్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫోన్ ద్వారా కంప్లైంట్ చేసిన బాధితురాలు ఆ తర్వాత రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. దీంతో నిందితుడు అజేయన్పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 342 (అక్రమ నిర్బంధం) కింద కేసు నమోదుచేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.