బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SPB:ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త తెలిసింది మొదట కొడుకు కాదు, చరణ్ కు చెప్పింది వాళ్లే, నిమిషాల్లో!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ హైదరాబాద్/ బెంగళూరు: భారతీయ దిగ్గజ గాయకుల్లో మొదటి జాబితాలోని ఒకరైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ( శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం) మృతితో యావత్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. భారతదేశంలోని 17 బాషల్లో 41 వేల 230 పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత అభిమానులను వదిలివెళ్లారు అనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి ఎస్పీబీ ఆరోగ్యం గురించి ఆందోళనతో సతమతం అవుతున్న ఆయన కుమారుడు ఎస్పీ. చరణ్ కంటే గానగంధర్వుడు మరణించాడు అనే వార్త మొదట తెలిసిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. అలనాటి దిగ్గజ దర్శకుడు భారతీరాజ, ఎస్పీ, చరణ్ ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు, బహుబాష నటి స్నేహ భర్త, నటుడు ప్రసన్నకు ఎస్పీ బాలసుబ్రమణ్య మరణించారనే వార్త తెలిసింది.

Road Romeo: అమ్మాయి చెయ్యిపట్టినా, ఆంటీకి కన్నుకొట్టినా మీ ఫోటోలకు దండం పెట్టేస్తారు, ఏక్ మార్ తీన్Road Romeo: అమ్మాయి చెయ్యిపట్టినా, ఆంటీకి కన్నుకొట్టినా మీ ఫోటోలకు దండం పెట్టేస్తారు, ఏక్ మార్ తీన్

ఆసుపత్రి బయట ఎస్పీ చరణ్

ఆసుపత్రి బయట ఎస్పీ చరణ్

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తను చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రి వైద్యులు దృవీకరించిన సమయంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అలనాటి ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజ, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు ప్రసన్న సోషల్ మీడియాలో ఎస్పీబీకి నివాళులు అర్పిస్తూ ట్విట్ చేశారు.

 అర్దగంటలో చెబుతాను అనేలోపు !

అర్దగంటలో చెబుతాను అనేలోపు !

శుక్రవారం మద్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి ముందు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ. చరణ్ మీడియాతో మాట్లాడుతూ అర్దగంట తరువాత ఆసుపత్రి వైద్యులు నాన్నగారి హెల్త్ బులిటిన్ విడుదల చేస్తామని తనకు ఇప్పుడే చెప్పారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని ఎస్పీ. చరణ్ చెబుతున్న సమయంలో ఆయన ప్రాణ స్నేహితుడు వెంకట్ ప్రభు అక్కడికి వెళ్లి మీ నాన్నగారు ఇక లేరు అని చరణ్ కు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఎస్పీబీ ఫ్రెండ్ భారతీరాజ, స్నేహా భర్త

ఎస్పీబీ ఫ్రెండ్ భారతీరాజ, స్నేహా భర్త


ఎస్పీ బాలసుబ్రమణ్య మరణవార్తను మొదట ప్రపంచానికి తెలియజేసింది ముగ్గురు వ్యక్తులు. అలనాటి ప్రముఖ దర్శకుడు, నటుడు, ఎస్పీ బాలసుబ్రణ్యం ప్రాణస్నేహితుడు భారతీరాజ, ప్రముఖ నటి స్నేహా భర్త, బహుబాష నటుడు ప్రసన్న, ఎస్పీ చరణ్ ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఎస్పీ. బాలసుబ్రమణ్యం ఇకలేరు అంటూ సోషల్ మీడియాలో ట్విట్ చెయ్యడంతో ఎస్పీబీ అభిమానులు షాక్ కు గురైనారు.

కోట్లాది మంది అభిమానుల కోరిక ఫలించలేదు

కోట్లాది మంది అభిమానుల కోరిక ఫలించలేదు


ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసిన రోజు నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని భారతదేశంలోని సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు దేవుడిని ప్రార్థించారు. ఎస్పీబీకి మెరుగైన చికిత్స అందించడానికి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు అమెరికాకు చెందిన వైద్యనిపుణుల సహకారం తీసుకున్నారు. అయితే దేవుడు కరుణించకపోవడంతో శుక్రవారం మద్యాహ్నం 1. 04 గంటల సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అందరిని వదిలి స్వర్గానికి చేరుకున్నారు.

English summary
SP Balasubrahmanyam: Director Venkat Prabhu Close to SP Charan was the First Person to Shared the SP Balasubrahmanyam Death today. SP Balasubrahmanyam breathed his last at 1:04 PM on September 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X