వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో టెన్షన్.. టెన్షన్... రాత్రి నిర్ణయమన్న స్పీకర్, సహచరులతో కుమార మంతనాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కన్నడనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాపై గురువారం లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో మరింత హీటెక్కాయి. ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలించిన స్పీకర్ రమేశ్ కుమార్ .. ఈ రాత్రంతా పరిశీలిస్తానని ప్రకటించారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తన విజ్ఞత మేరకు డిషిసన్ తీసుకుంటారా ? లేదంటే కోర్టు సూచనల మేరకు నడుచుకుంటారా అనే టెన్షన్ నెలకొంది.

క్యాబినెట్ భేటీ..?

క్యాబినెట్ భేటీ..?

మరోవైపు సీఎం కుమారస్వామి ప్రస్తుత పరిస్థితులను నిశీతంగా గమనిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకుందామని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిచుయేషన్‌పై మంత్రివర్గం చర్చించనుంది. మరోవైపు విధానసౌద పరిసరాల్లోని రెండు కిలోమీటర్లు పరిధిలో బెంగళూరు పోలీసు కమిషనర్ నిషేధాజ్ఞలు విధించారు. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించబోమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. అయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కాసేపటి క్రితం కుమారస్వామి ట్వీట్ చేశారు.

సుప్రీం జోక్యం..

సుప్రీం జోక్యం..

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాపై గురువారం లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రమేశ్‌కు స్పష్టంచేసింది. ఏ నిర్ణయం తీసుకన్నారనే అంశంపై శుక్రవారం తమకు తెలయజేయాలని పేర్కొన్నది. దీంతో ఈ రాత్రి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. ఉదయం కోర్టు ఏ విషయం చెప్పాల్సి ఉన్నందున ఆయన డిసిషన్ కీలక పరిణామాలకు దారితీసింది. మరోవైపు న్యాయ నిపుణులు సంప్రదించి, తన విచక్షణాధికారాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. గతంలో కూడా స్పీకర్లు కోర్టు తీర్పులను ఖతారు చేసిన సందర్భాలు లేవు. తమ పరిధి శాసన వ్యవస్థ అయినందున .. తమకు విశేష అధికారలు ఉంటాయని స్పీకర్ కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.

సరికాదు

సరికాదు

ఇదిలాఉంటే స్పీకర్ రమేశ్ వైఖరిని విపక్ష బీజేపీ తప్పుపడుతుంది. స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలపై ప్రభావం చూపిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. వారిని బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఫిరాయింపు కింద పరిగణించి ఆమోదించాలని సూచించారు. సర్వోన్నత న్యాయస్థానం సూచనలను పరిగణనలోకి తీసుకుని రాజీనామాలను ఆమోదించాలని కోరారాయన.

English summary
Major developments are underway in Bengaluru as a cabinet meeting has the city on edge. Chief Minister HD Kumaraswamy is scheduled to chair a cabinet meeting. Bengaluru Police Commissioner Alok Kumar has issued prohibitory orders within a two-km radius around the Vidhana Soudha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X